newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో ముందడుగు.. బయటపడ్డ రెయిలింగ్

17-10-201917-10-2019 19:17:25 IST
2019-10-17T13:47:25.943Z17-10-2019 2019-10-17T13:47:21.821Z - - 14-11-2019

రాయల్ వశిష్ట బోటు వెలికితీతలో ముందడుగు.. బయటపడ్డ రెయిలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పుగోదావరి జిల్లాలో గత నెలలో జరిగిన బోటు ప్రమాదం విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ బోటు ప్రమాదంలో గల్లంతయిన వారిలో కొందరి ఆచూకీ దొరకలేదు. బోటుని బయటకు తీస్తేనే అందులో ఏమైనా మృ‌తదేహాలు ఉన్నాయేయో తేలే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోటుని వెలికితీసే పనికి ముందుకొచ్చింది ధర్మాడి సత్యం టీం. 

తాజాగా కచ్చలూరు బోటు ఆపరేషన్ లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిన బోటును సత్యం బృందం గుర్తించింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. బోటు వెలికితీతలో తాజాగా సత్యం బృందం లంగర్లు వేసింది. రోప్ లాగే ప్రయత్నంలో బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. ఇంకా బోటుకి సంబంధించిన అవశేషాలు ఏవైనా బయటకు వస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు చీకటి పడిపోవడంతో  బోటు వెలికతీత పనులను శుక్రవారం కొనసాగిస్తామని సత్యం బృందం చెబుతోంది. మరోవైపు కాకినాడు పోర్ట్‌ అధికారులు బోటు ప్రమాద స్థలానికి చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని అడిగి బోటు ఆచూకీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెయిలింగ్ బయపడడంతో మరిన్ని ఆధారాలు బయటకు రావచ్చని స్థానికులు భావిస్తున్నారు.  కాకినాడ పోర్టు నుంచి వచ్చిన నిపుణుల పర్యవేక్షణలో ఈ వెలికితీత పనులు మళ్లీ కొనసాగించారు. 

లంగరుకు తగిలిన బలమైన వస్తువు గురించిన వార్త బయట పడడం ఈ బృందానికి కొండంత ధైర్యం తెచ్చిపెట్టింది. ఈ బలమయిన వస్తువు బోటుదే అని భావించారు. కానీ రెయిలింగ్ ఊడిపోవడంతో దానిని బయటకు తీశారు. బోటును బయటకు లాగేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈనెల 14వ తేదీకే బోటు మునిగి నెలరోజులు అయింది. గోదావరికి వరద పెరగడంతో బోటు లాగే ప్రయత్నాలను ధర్మాడి సత్యం టీం కొంతకాలం వాయిదా వేసింది. తాజాగా రెండురోజుల క్రితం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బోటుని బయటకు తీసి చూపిస్తామని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. అదే జరిగితే ఈ కేసులో ఎన్నో అనుమానాలు పటాపంచలు అవుతాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle