newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

రాధా రూట్ స‌రైన‌దేనా..?

26-06-201926-06-2019 08:39:08 IST
Updated On 26-06-2019 16:54:15 ISTUpdated On 26-06-20192019-06-26T03:09:08.085Z26-06-2019 2019-06-26T03:06:57.708Z - 2019-06-26T11:24:15.652Z - 26-06-2019

రాధా రూట్ స‌రైన‌దేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర రాజ‌కీయాల్లో వంగ‌వీటి కుటుంబానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ల‌క్ష‌ల్లో అభిమానులు, బ‌ల‌మైన కాపు సామాజ‌క‌వ‌ర్గం అండ ఆ కుటుంబం సొంతం. దీంతో అన‌తికాలంలో విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రంగా కీల‌క నేత‌గా ఎదిగారు. ఆయ‌న హ‌త్య అనంత‌రం ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి సైతం ఎమ్మెల్యేగా జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు.

అయితే, వారి కుమారుడు, రంగా రాజ‌కీయ వార‌సుడు వంగవీటి రాధాకృష్ణ మాత్రం రాజ‌కీయంగా త‌ప్ప‌ట‌డుగులు వేస్తూ వ‌స్తున్నారు.ప్ర‌జ‌ల నాడిని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం, దూకుడు వైఖ‌రి, రాజ‌కీయంగా నిల‌క‌డ లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయ జీవితం ప్ర‌మాదంలో ప‌డింది.

అనేక పార్టీలు మారి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు తింటున్నారు. నాలుగు నెల‌ల ముందు ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఆయ‌న ఇప్పుడు జ‌న‌సేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సుదీర్ఘంగా స‌మావేశం అయిన ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌న‌సేన గూటికి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

2004లో కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన వంగ‌వీటి రాధా త‌ర్వా ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించ‌గానే ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో త‌న‌తో పాటు పార్టీ కూడా ఓడిపోవ‌డంతో కొంత‌కాలం రాజ‌కీయాల‌కు దూర‌మై త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

త‌న తండ్రి వంగ‌వీటి రంగా, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స‌న్నిహితులు కావ‌డం, జ‌గ‌న్‌, రాధా ఇద్ద‌రూ యువ‌నేత‌లు కావ‌డంతో ఆయ‌న స‌రైన వేదిక‌పైకే వ‌చ్చార‌ని అంతా భావించారు. వైసీపీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిగా, విజ‌య‌వాడ‌లో కీల‌క నేత‌గా ఆయ‌న కొంత‌కాలం చురుగ్గా ప‌నిచేశారు.

అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, జ‌గన్ మాత్రం ఆయ‌న‌కు ఈస్ట్‌లోనే గెలుపు అవ‌కాశాలు ఉన్నందున అక్క‌డినుంచే పోటీ చేయాల‌ని సూచించారు. రాధా ఒప్పుకోక‌పోవ‌డంతో మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ సూచించింది. అయినా రాధా ఒప్పుకోలేదు.

దీంతో ఎన్నిక‌ల ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ పార్టీని వీడారు. త‌ర్వాత ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు. త‌న తండ్రి తీవ్రంగా వ్య‌తిరేకించిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ల‌డాన్ని రాధా అనుచ‌రుల‌తో పాటు ఆయ‌న‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్న కాపు సామాజ‌క‌వ‌ర్గం కూడా జీర్ణించుకోలేక‌పోయింది.

దీంతో రాధాపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా ఆయ‌న వెన‌క్కు త‌గ్గ‌కుండా టీడీపీ స్టార్ క్యాంపెయిన‌ర్ హోదాలో ప్ర‌చారం నిర్వ‌హించారు. టీడీపీ గెలుపును ఆకాంక్షిస్తూ యాగం సైతం నిర్వ‌హించారు.

పార్టీలో చేరిన‌ప్పుడు రాధాకు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు ఒక‌సారి అవ‌కాశం ఉన్నా రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వ‌లేదు. ఇప్పుడు టీడీపీ దారుణంగా ఓడిపోవ‌డంతో రాధాకు ఎమ్మెల్సీ ద‌క్కే అవ‌కాశం లేదు. దీంతో టీడీపీలో చేరి రాజ‌కీయంగా తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని రాధా గుర్తించిన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలో ప‌నిచేసిన రాధాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కొంత సాన్నిహిత్యం ఉంది. పైగా త‌న‌కు అండ‌గా ఉంటున్న సామాజ‌క‌వ‌ర్గం కూడా భ‌విష్య‌త్‌లో జ‌న‌సేన పార్టీ వైపు ఉంటుంద‌ని రాధా భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. జ‌న‌సేన‌లో అయినా ఆయ‌న సుదీర్ఘ‌కాలం కొన‌సాగి రాజ‌కీయంగా స్థిరంగా ఉంటారో లేదో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle