newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

రాజ‌న్న క్యాంటీన్లు C/o ప్రభుత్వ ఆసుప‌త్రులు

10-10-201910-10-2019 08:43:33 IST
Updated On 10-10-2019 15:03:04 ISTUpdated On 10-10-20192019-10-10T03:13:33.053Z10-10-2019 2019-10-10T03:10:17.552Z - 2019-10-10T09:33:04.277Z - 10-10-2019

రాజ‌న్న క్యాంటీన్లు C/o ప్రభుత్వ ఆసుప‌త్రులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీల‌ను ఇచ్చి నెర‌వేర్చక‌పోవ‌డంతో ప్రజ‌ల్లో భారీ వ్యతిరేక‌తను మూట‌గ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. 100 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన చంద్రబాబు ఘోరంగా 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

అటువంటి హామీల‌లో ఒకైన అన్నా క్యాంటీన్ల‌ను చంద్ర‌బాబు స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు మాత్ర‌మే ఏర్పాటు చేశారు. అయితే కొంత వ‌ర‌కు అది పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డిన ప‌థకం అయిన‌ప్ప‌టికీ బాబును అధికారంలోకి తీసుకొచ్చేంత స్టామినా ఆ ప‌థ‌కానికి లేక‌పోయింది.

ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఆ అన్నా క్యాంటీన్లు మూత‌ప‌డుతాయా..?  లేక కొనసాగుతాయా..? అని ఎంద‌రో భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. అయితే దానిపై జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

రాజ‌న్న క్యాంటీన్ల పేరుతో పేద‌వారికి నామ‌మాత్ర‌పు ధ‌ర‌తో మూడుపూట‌లా భోజ‌నాన్ని అందించేందుకు ఉద్దేశించిన ఈ క్యాంటీన్ల‌ను ప‌రిమితంగా తీసుకురానుంది వైసీపీ ప్ర‌భుత్వం. ఆసుప‌త్రుల ఆవ‌ర‌ణ‌లో లేదా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టుగా స‌మాచారం.

దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1న లేదా సంక్రాంతి పండుగ నాటికి రాజ‌న్న క్యాంటీన్లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల‌లో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల ఆవ‌ర‌ణ‌ల్లో రాజ‌న్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.

25 ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యాన్ని మించి ఉన్న అన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌న్య కాంటీన్ల‌ను నెల‌కొల్ప‌నుంది. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగులు, వారి స‌హాయ‌కుల‌కు భోజ‌న అవ‌స‌రాల‌ను తీర్చాల‌న్న కార‌ణంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

వైద్య‌, ఆరోగ్య‌, మున్సిప‌ల్‌శాఖ అధికారుల ఉమ్మ‌డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాజ‌న్న క్యాంటీన్లు కొన‌సాగ‌నున్నాయి. 25 ప‌డ‌క‌ల‌కంటే త‌క్కువ సామ‌ర్ధ్యం ఉన్న మండ‌ల స్థాయి ఆసుప‌త్రుల్లోనూ ఈ రాజ‌న్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తామంటూ మున్సిప‌ల్ అధికారులు చెప్పుకొస్తున్నారు.

నిజానికి రాష్ట్రంలో అనేక ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స్థ‌లా భావం నెల‌కొంది. ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ‌, వాటికి కొత్త భ‌వ‌నాల‌ను నిర్మించిన అనంత‌రం స్థ‌లాభావం మ‌రింత క్లిష్ట‌మైంది. అలాంటి ప‌రిస్థితుల్లో రాజ‌న్న క్యాంటీన్ల‌ను ఎలా ఏర్పాటు చేస్తార‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతుండ‌టం గ‌మ‌నార్హం.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle