newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

రాజ‌ధాని మార్పా..? వికేంద్రీక‌ర‌ణ‌నా..?

26-08-201926-08-2019 07:49:01 IST
2019-08-26T02:19:01.639Z26-08-2019 2019-08-26T02:01:09.873Z - - 15-09-2019

రాజ‌ధాని మార్పా..? వికేంద్రీక‌ర‌ణ‌నా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌ధాని ఎక్క‌డ అనేది ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇటీవ‌లి కృష్ణా న‌ది వ‌ర‌ద‌లు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌తో రాజ‌ధాని ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అస‌లు రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగిస్తారా..?

ఇంకేదైనా ప్రాంతానికి మారుస్తారా..? రాజ‌ధానిని ఒక్క ప్రాంతానికే ప‌రిమితం చేస్తారా..? అభివృద్ధిని వికేంద్రీక‌రిస్తారా..? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరుల‌ను క‌లిచివేస్తున్నాయి.

ఇక‌, వివిధ రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు ఎవ‌రికి తోచిన‌ట్లు వారు అంచ‌నాలు వేస్తున్నారు. మ‌రికొందరైతే రాజ‌ధానిని త‌మ ప్రాంతంలో పెట్టాల‌నే డిమాండ్లు మొద‌లు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూడా రాజ‌ధాని మార్పు ఖాయ‌మ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఆ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే కుటుంబ‌రావు స్వ‌యంగా ఈ విష‌యం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రాజ‌ధాని మారుస్తామ‌నే స‌మాచారాన్ని కేంద్రానికి కూడా జ‌గ‌న్ చెప్పార‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా రాజ‌ధాని ప్రాంత రైతులు వివిధ పార్టీల నేత‌ల‌ను క‌లిసి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌వ‌ద్ద‌నే డిమాండ్‌తో రోడ్డెక్కుతున్నారు. కాగా, ఇంత జ‌రుగుతున్నా ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌న‌స్సులో మాత్రం ఏముంద‌నేది బ‌య‌ట ప‌డ‌టం లేదు.

అయితే, జ‌గ‌న్ విదేశాల్లో ఉన్న‌ప్పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ వ‌చ్చాక కూడా మ‌రోసారి రిపీట్ చేశారు. దీంతో రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ఏదో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇదే అంశంపై బీజేపీలో చేరిన ఎంపీ టీజీ వెంక‌టేష్ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు చెప్పారు. నాలుగు రాజ‌ధానులు ఉంటాయ‌ని, ప్రాంతీయ మండ‌ళ్లు ఏర్పాటు చేసి ఒక్కో మండ‌లిలో ఒక్కో రాజ‌ధాని పెడ‌తార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే కేంద్ర పెద్ద‌ల‌కు జ‌గ‌న్ చెప్పారని పేర్కొన్నారు. కానీ, వైసీపీ నేత‌లు, ప్ర‌భుత్వం మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

అభివృద్ధిని, పాల‌నా వ్య‌వ‌స్థ‌ను వికేంద్రీక‌రించాల‌నే ఆలోచ‌న‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అమ‌రావ‌తిలో ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మిస్తామ‌ని చెబుతూ చంద్ర‌బాబు స‌ర్కార్ 33 వేల ఎక‌రాలు సేక‌రించింది.

ఇంత భూమి అవ‌స‌రం లేద‌ని వైసీపీ ముందు నుంచీ చెబుతోంది. ఇప్పుడు కూడా వైసీపీ స‌ర్కార్ ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్‌లా.. కేవ‌లం అమ‌రావ‌తికే అభివృద్ధి, పాల‌న వ్య‌వ‌స్థ కేంద్రీకృతం కావొద్ద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం ఉంది.

అయితే, ఇది కీల‌క అంశంగా మారిపోయింది. పార్టీలు ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వం మాత్రం దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని, ఆ త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle