newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చేస్తారా..?

20-08-201920-08-2019 17:34:40 IST
Updated On 21-08-2019 11:50:41 ISTUpdated On 21-08-20192019-08-20T12:04:40.935Z20-08-2019 2019-08-20T12:04:39.433Z - 2019-08-21T06:20:41.876Z - 21-08-2019

రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చేస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్మించాలనుకున్న రాజ‌ధాని అమ‌రావ‌తిని మార్చాల‌నుకుంటున్నారా ? అంటే అవున‌నే అనిపిస్తోంది పుర‌పాల‌క శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌లు చూస్తుంటే.

ఇవాళ విశాఖ‌ప‌ట్నంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ అమ‌రావ‌తిపై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ వెనుక రాజ‌ధానిని మార్చాల‌నే ఆలోచ‌న ఉన్నట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అమ‌రావ‌తి పేరుతో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాన్ని నిర్మించ త‌ల‌పెట్టింది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌రిగిన అమ‌రావ‌తి నిర్మాణానికి సుమారు 30 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో రైతుల వ‌ద్ద నుంచి సేక‌రించారు. పొలాలు ఇచ్చిన రైతుల‌కు ఎక‌రానికి వెయ్యి గ‌జాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్ల‌ను ఇస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది.

అయితే, అనేక కార‌ణాల అమ‌రావ‌తి నిర్మాణం అనుకున్నంత వేగంగా జ‌ర‌గ‌లేదు. ఎక్కువ‌గా తాత్కాలిక భ‌వ‌నాలు మిన‌హా శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణం జ‌ర‌గ‌లేదు. ఇంత‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోయి జ‌గ‌న్ స‌ర్కార్ రావ‌డంతో అస‌లు అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొన‌సాగుతుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అమరావ‌తిలో నిర్మాణ ప‌నుల‌ను కూడా ప్ర‌భుత్వం నిలిపివేయ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అమ‌రావ‌తిపై అధ్య‌య‌నానికి జ‌గ‌న్ ఒక క‌మిటీని కూడా నియ‌మించారు. దీంతో అమ‌రావ‌తి ప్రాంతంలో రియ‌ల్ ఎస్టేట్ పూర్తిగా త‌గ్గిపోయింది.

ఇంత‌లో మొన్న‌టి కృష్ణాన‌ది వ‌ర‌ద‌ల కార‌ణంగా రాజ‌ధానిలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట‌మునిగాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. అమరావ‌తికి వ‌ర‌ద ముప్పు ఉంద‌ని, వ‌ర‌ద నీటిని తోడిపోయాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తిలో నీటిని మ‌ళ్లించాలంటే డ్యాములు, కాలువలు నిర్మించాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. రాజ‌ధాని నిర్మాణానికి ఎక్కువ వ్య‌యం అవుతుంద‌ని చెప్పారు. రాజ‌ధానిపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పూర్తి ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

బొత్స వ్యాఖ్య‌ల వెనుక రాజ‌ధానిని మార్చే ఉద్దేశ్యం ఉన్న‌ట్లు అనుమానాలు క‌లుగుతున్నాయి. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంచుకోవ‌డంతో పాటు చంద్ర‌బాబు స‌ర్కార్ అవ‌లంభించిన విధానాల‌పై వైసీపీ గ‌తంలో నుంచే ఆరోప‌ణ‌లు చేస్తోంది.

రాజ‌ధానిగా ఏడాదికి మూడు పంట‌లు పండే ఈ ప్రాంతం స‌రైంది కాద‌ని, రాజ‌ధాని నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని, ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌నేవి వైసీపీ ఆరోప‌ణ‌లు. దీనికి తోడు క‌చ్చితంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌లేదు.

అయితే, అమ‌రావ‌తిలోనే ఇల్లు, పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించుకున్న జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యంలో పున‌రాలోచ‌న చేసే అవ‌కాశం ఉందా అనేది ఆస‌క్తిగా మారింది. కానీ, బొత్స వ్యాఖ్య‌లు మాత్రం అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వానికి ఏదో ఆలోచ‌న ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు అమ‌రావ‌తిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చంపేస్తోంద‌ని ఆరోపిస్తోంది. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle