newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

రాజ‌ధానిపై జ‌గ‌న్ నిర్ణ‌యం అదేనా..?

01-09-201901-09-2019 08:54:29 IST
2019-09-01T03:24:29.376Z01-09-2019 2019-09-01T03:24:16.260Z - - 20-09-2019

రాజ‌ధానిపై జ‌గ‌న్ నిర్ణ‌యం అదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌ధాని వ్య‌వ‌హారంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తిలో రాజ‌ధాని కొన‌సాగుతుందా లేదా అనేది రాష్ట్రంలో గంద‌ర‌గోళంగా మారింది. అన్ని పార్టీలు రాజ‌ధానిని త‌ర‌లించ‌వ‌ద్ద‌ని డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రోవైపు మంత్రులు మాత్రం రాజ‌ధాని మారుస్తార‌ని ఎవ‌రు చెప్పారు అంటూ ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అయితే, బ‌య‌ట అంద‌రూ ఇంత‌లా గంద‌ర‌గోళ‌ప‌డుతున్నా.. రాజ‌ధాని విషయంలో జ‌గ‌న్ మాత్రం స్ప‌ష్ట‌త‌తోనే ఉన్నార‌ని అంటున్నారు.

అమ‌రావ‌తిలో రాజ‌ధాని కొన‌సాగించాల‌నే నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చార‌ట‌. అయితే, అధికార వికేంద్రీక‌ర‌ణపై జ‌గ‌న్ ఎక్కువ‌గా ఆలోచిస్తున్నారు. గ‌తంలో హైద‌రాబాద్‌లా అధికారం, అభివృద్ధి అంతా ఒకే చోట‌కు ప‌రిమితం కావ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ప్రాంతీయ విభేదాలు వ‌స్తాయ‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఆంధ్ర‌కు తొలి రాజ‌ధానిగా ఉన్న క‌ర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. త‌ద్వారా రాయ‌ల‌సీమ‌కు ప్రాధాన్య‌త ఇచ్చినట్లు అవుతుంద‌ని ఆయ‌న అనుకుంటున్నారు.

దీంతో పాటు చిత్తూరులో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా గ‌త ప్ర‌భుత్వాలు కొంత ప్ర‌య‌త్నాలు చేశాయి. వాటిని కొన‌సాగిస్తూ ఇండ‌స్ట్రీయ‌ల్ హ‌బ్‌గా చిత్తూరును మార్చాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌కు కూడా త‌గు విధంగా న్యాయం జ‌ర‌గాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల‌ని, ఐటీ సంస్థ‌లు విశాఖ‌లో స్థాపించేలా ప్రోత్స‌హించాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఇలా అధికార వికేంద్రీక‌ర‌ణ ద్వారా అన్ని ప్రాంతాల‌కు న్యాయం చేసినట్ల‌వుతుంద‌ని చెబుతున్నారు. పైగా ఏ పార్టీ కూడా అధికార వికేంద్రీక‌ర‌ణను వ్య‌తిరేకించే ధైర్యం కూడా చేయ‌లేవు.

ఇక‌, అమ‌రావ‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబుకు భిన్నంగా జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. ఖ‌ర్చును పూర్తిగా త‌గ్గించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇందుకు ఉదాహ‌ర‌ణ కృష్ణా న‌దిపై నిర్మించాల‌నుకున్న ఐకానిక్ బ్రిడ్జ్‌. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలోనే జ‌గ‌న్ స‌గానికి పైగా ఖ‌ర్చు త‌గ్గించాల‌ని ఆదేశాలు ఇచ్చారు. అవ‌స‌రానికి స‌రిపోయేలా త‌క్కువ ఖ‌ర్చుతో రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాలని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

అందుకే చంద్ర‌బాబు హ‌యాంలో టెండ‌ర్లు పూర్తైన ప‌నుల‌ను ఆపేయాల‌ని నిర్ణ‌యించారు. సీఆర్డీఏపై జ‌రిగిన స‌మీక్ష‌లో జ‌గ‌న్ ఈ దిశ‌గా స్ప‌ష్టంగా ఆదేశాలు ఇచ్చార‌ని చెబుతున్నారు.

అమ‌రావ‌తిని చంద్ర‌బాబు అనుకున్న‌ట్లుగా నిర్మించ‌డం ఆర్థికంగా పెను భారంగా మారుతుంద‌నేది మాత్రం ప్ర‌భుత్వం ఒక అంచ‌నాకు వ‌చ్చింది. కాబ‌ట్టి, అమ‌రావ‌తిని మార్చ‌కుండా ఖ‌ర్చు త‌గ్గించ‌డం, అధికార వికేంద్రీక‌ర‌ణ చేసే దిశ‌గానే జ‌గ‌న్ ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle