newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

రాజ‌కీయ విభేదాలు ప‌క్కన పెట్టేశారా...!

10-10-201910-10-2019 15:30:34 IST
Updated On 10-10-2019 15:30:26 ISTUpdated On 10-10-20192019-10-10T10:00:34.139Z10-10-2019 2019-10-10T10:00:00.504Z - 2019-10-10T10:00:26.561Z - 10-10-2019

రాజ‌కీయ విభేదాలు ప‌క్కన పెట్టేశారా...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ద్ధ వ్య‌తిరేకులు. జ‌గ‌న్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తారు. మిగ‌తా అన్ని పార్టీల కంటే త‌న‌కు జ‌గ‌నే ప్ర‌ధాన టార్గెట్ అన్న‌ట్లుగా ప‌వ‌న్ వైఖ‌రి ఉంటుంది.

వైసీపీ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ల‌క్ష్యంగా చేసుకొని త‌ర‌చూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటుంది. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో జ‌గన్‌కు రాజ‌కీయ విభేదాలు ఉన్న తాము మాత్రం స‌త్సంబంధాలు నెర‌పాల‌ని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు.

2009కి ముందు వ‌ర‌కు వైఎస్ కుటుంబానికి, మెగా కుటుంబానికి మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవు. అద‌పాద‌డ‌పా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో వైఎస్‌, చిరంజీవి వేదిక పంచుకున్నారు. జ‌గ‌న్ స్థాపించిన సాక్షి మీడియా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి కూడా చిరంజీవిని జ‌గ‌న్ అతిథిగా ఆహ్వానించారు. అయితే ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించాక వీరి మ‌ధ్య స‌హ‌జంగానే దూరం పెరిగింది. పీఆర్పీని ఆదిలోనే దెబ్బ‌తీసేందుకు ఒక ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిగా వైఎస్ వ్య‌వ‌హరించారు.

కానీ, వైఎస్‌, చిరంజీవి వ్య‌క్తిగ‌తంగా ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేసుకోలేదు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్‌కు చెక్ పెట్ట‌డానికి కాంగ్రెస్ పెద్ద‌లు చిరంజీవిని కాంగ్రెస్‌లోకి తెచ్చారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్‌, చిరంజీవి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు మొద‌ల‌య్యాయి.

కొన్నిసార్లు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు కూడా దిగారు. ఇక‌, 2014లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌ను స్థాపించిన నాటి నుంచి జ‌గ‌న్‌ను శ‌త్రువుగా భావిస్తూ వ‌స్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ కూడా గ‌తంలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. జ‌గ‌న్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌న స‌త్తాను నిరూపించుకుంది అని ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసి జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శించారు.

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. జ‌గ‌న్ కూడా చిరంజీవి ప‌ట్ల సానుకూల వైఖ‌రితో ఉన్నారు. సాక్షి మీడియా అవార్డ్ కూడా ఓసారి చిరంజీవికి ద‌క్కింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప్ర‌మాణ‌స్వీకారానికి చిరంజీవిని కూడా ఆహ్వానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, చిరంజీవి తాజాగా న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంచుతోంది.

సైరా సినిమాకు మీడియా పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప‌లు ప్ర‌ముఖ ఛాన‌ళ్లు పోటీ ప‌డినా ఈ అవ‌కాశం సాక్షికి ఇచ్చారు నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌. సాక్షి కూడా ఈ సినిమాకు బాగా క‌వ‌రేజీ ఇచ్చింది. ఇక‌, సినిమాకు స్పెష‌ల్ షోస్ వేసేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఇక‌, చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను నేరుగా క‌ల‌వ‌నుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. శుక్ర‌వారం వీరికి జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఖ‌రారైంది.

జ‌గ‌న్‌ను క‌లిసి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చూడాల్సిందిగా చిరంజీవి కోర‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినందున శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేయ‌నున్నారు. అయితే, జ‌గ‌న్ - చిరంజీవి భేటీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, జ‌న‌సేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. జ‌గ‌న్‌తో స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించ‌డం బ‌ట్టి చూస్తుంటే ఇక రాజ‌కీయాలు, రాజ‌కీయ విభేదాల‌ను చిరంజీవి పూర్తిగా ప‌క్క‌న పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు కనిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle