newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పే యోచ‌న‌లో వైసీపీ నేత‌..?

11-10-201911-10-2019 11:02:18 IST
Updated On 11-10-2019 11:04:48 ISTUpdated On 11-10-20192019-10-11T05:32:18.856Z11-10-2019 2019-10-11T05:32:15.127Z - 2019-10-11T05:34:48.918Z - 11-10-2019

రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పే యోచ‌న‌లో వైసీపీ నేత‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డా.ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప్ర‌కాశం జిల్లాలో తిరుగులేని రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రు. అటువంటిది ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఆయ‌న‌కు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి. ఎల‌క్ష‌న్ ముందే వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చినా జ‌గ‌న్ చ‌రీష్మా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌కపోవ‌డంతో ఆయ‌న‌కు ఓట‌మి ప‌ల‌క‌రింపు త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీ ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు.

వైసీపీనే అధికారంలో ఉండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో త‌న‌దైన శైలిలో ముందుకుపోతున్నారు. మంచి నేత‌గా ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకున్న ఆయ‌న‌కు ఇప్పుడు ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అయితే, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత ఆయ‌న రాజ‌కీయాల్లో కొన‌సాగే విష‌యంపై చాలాసార్లు త‌ర్జ‌నబ‌ర్జ‌న పడిన‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గ‌ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు సైతం మారాయి. సీనియ‌ర్ నేత‌గా ఉన్న‌ ద‌గ్గుబాటికి ఏమాత్రం తెలీయ‌కుండానే పార్టీ కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తుండ‌టంతో ఆయ‌న కొంత‌ మ‌న‌స్థాపానికి గురైన‌ట్టు తెలుస్తుంది అయితే పార్టీ అధిష్టానంర‌తోపాటు జిల్లా మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి జోక్యంతో గ‌తంలో నెల‌కొన్న కొన్ని వివాదాల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది.

ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ద‌గ్గుబాటి ఇటీవ‌ల భేటీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌తో పాటు త‌న మ‌న‌సులోని మాటను ఆయ‌న ముందుపెట్టారు. భ‌ర్త ఒక‌పార్టీ, భార్య మ‌రొక పార్టీలో ఉండ‌టంతో రాజ‌కీయంగా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

పురందేశ్వ‌రి ఇటీవ‌ల కాలంలో వైసీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ద‌గ్గుబాటి టార్గెట్‌గా మారారు. ఆయ‌న‌పై పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో కూడా స‌మ‌స్య‌లు సృష్టించే ప్ర‌య‌త్నం ఏశారు. దీంతో సీఎం జ‌గ‌న్‌తో బుధ‌వారం సాయంత్రం ద‌గ్గుబాటి భేటీ అయ్యారు.

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌తోపాటు పార్టీప‌రంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని, త‌న కుమారుడు హితేష్ రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని చెప్పార‌ట‌. అయితే జ‌గన్ మాత్రం ద‌గ్గుబాటికి స‌ర్దిచెప్పార‌ట‌. ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని చెప్పార‌ట‌.

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంత‌కు ముందు ఒక‌సారి రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. 2009 ఎన్నిక‌ల సంద‌ర్బంగా కొడుకు హితేష్‌కు పౌర‌స‌త్వ స‌మ‌స్య రావ‌డంతో ద‌గ్గుబాటి రంగంలోకి దిగారు. మొన్నటి ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయారు. అయితే తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో మ‌రోసారి ద‌గ్గుబాటి రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యాన్నే జ‌గ‌న్‌కు ఆయ‌న చెప్పార‌ట‌. అయితే, జ‌గ‌న్ మాత్రం ద‌గ్గుబాటిని వారించార‌ని, వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ద‌గ్గుబాటి పాలిటిక్స్‌కు దూరంగా జ‌ర‌గ‌డం మాత్రం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.

త్వ‌ర‌లోనే ద‌గ్గుబాటి ప‌రుచూరులో అనుచ‌రులు, అభిమానుల‌తో స‌మావేశం కానున్నార‌ని తెలుస్తుంది. ఈ స‌మ‌వేశంలో ద‌గ్గుబాటి త‌న రాజ‌కీయ స‌న్యాసంపై ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తుంది. బీజేపీకి పురందేశ్వరి రాజీనామా చేసే అవ‌కాశం లేదు. దీంతో తానే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటే బాగుంటుంద‌న్న భావ‌న‌లో ద‌గ్గుబాటి ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక రాజ‌కీయాల్లో ద‌గ్గుబాటి క‌నిపించే అవ‌కాశాలు త‌క్కువ‌ని తెలుస్తుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle