newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

రాజు తలిస్తే కొదవేముందు.. సాక్షికి కోట్ల ప్రకటనలు

03-10-201903-10-2019 08:41:43 IST
2019-10-03T03:11:43.301Z03-10-2019 2019-10-03T03:11:41.403Z - - 19-02-2020

రాజు తలిస్తే కొదవేముందు.. సాక్షికి కోట్ల ప్రకటనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా' అన్న చందంగా ఉంది ఏపీ ప్రభుత్వం-సాక్షి మధ్య అనుబంధం. సాక్షి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ కాకపోయినా ఇప్పుడు దానికి మించి అన్ని విధాలా లబ్ది పొందుతుంది. ఇప్పటికే ఆ సంస్థలో పనిచేసే ఉన్నత ఉద్యోగులు ప్రభుత్వ కీలక పదవులలో ఉంటే ఏపీ సెక్రటేరియట్ లో ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో అంతమంది సాక్షి ఉద్యోగులు కూడా ఎమ్మెల్యేల పీఏలుగా.. మంత్రుల పీఆర్ఓలుగా చెలామణి అయిపోతున్నారని సాక్షాత్తు ఆ సెక్రటేరియట్ ఉద్యోగులే గొణుక్కుంటున్నారు. లోకల్ గా కూడా పలుకుబడి ఉన్న సాక్షి ఉద్యోగులైతే ఏకంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలలో చేరిపోయారు.

ఇక సాక్షి పేపర్.. సాక్షి టీవీ ఛానెల్ అయితే ఏపీ ప్రభుత్వం నుండి ఎంత పిండాలో అంత పిండుకుంటుంది. కాదు కాదు సాక్షి పిండడమేంటి.. ఆ ప్రభుత్వమే పిలిచి కోట్లకు కోట్ల ప్రకటనలను ఇచ్చేస్తుంది. నిన్నటికి నిన్న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభోత్సవానికి సాక్షి పత్రికకు రూ.కోట్ల విలువైన ప్రకటనలు ఐఅండ్ పీఆర్ నుంచి వెళ్లాయట. ఇందులో తప్పేముంది అన్ని ప్రభుత్వాలు చేసేదే కదా.. అన్ని పేపర్ల మాదిరే సాక్షికి కూడా ఇచ్చార్లే అంటారేమో సుమీ.. సర్క్యులేషన్‌లో నెంబర్ వన్ అయిన ఈనాడుకు ఒక్క ఏపీ ఎడిషన్‌కు మాత్రమే ప్రకటన ఇవ్వగా సాక్షిలో ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ అన్నిటిలో ఆ బొమ్మలే అచ్చేశారు.

నిజానికి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు ప్రాధాన్యం ఇవ్వాలని ఓ రూల్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సాక్షి పత్రికే అన్ని రూల్స్ రాసేసుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వం నుండి ప్రకటనకు వచ్చే నిధులలో డెబ్భై శాతానికి పైగా సాక్షికి బదిలీ చేస్తే మిగతా ముప్పై శాతం మిగతా పత్రికలకు పంచేస్తారు. ఇక ఆంధ్రజ్యోతిలాంటి వాటికైతే అసలు అది కూడా లేదనుకోండీ. ఇక ఛానెళ్ల పరిస్థితి కూడా అంతే.. కాస్తో కూస్తో కనికరం చూపే ఛానెళ్లకు కొసరు వేసి తమ సొంత డబ్బాను పూర్తిగా నింపేసుకున్నారు.

ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే.. డెబ్భై శాతం నిధులను తమ సంస్థకే ఇవ్వాలంటే అదే స్థాయిలో ప్రకటనలు కూడా ఉండాలి. కానీ ఇంతవరకు మాత్రమే ఓ పత్రికలో ప్రకటనను ఉండాలని అందుకూ కోర్టుల నుండి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఏపీతో పాటు తెలంగాణ, హైదరాబాద్ సిటీ ఎడిషన్లో కూడా ఏపీ గ్రామ సచివాలయాలు ప్రకటనలు ప్రింట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పథకానికి సంబంధించి తెలంగాణ, హైదరాబాద్‌ ఎడిషన్లలో కూడా ఫుల్ పేజీ ప్రకటనలు అవసరమో.. ఏపీలో ఉన్న మిగతా పేపర్లకిస్తే ప్రజలకు పథకం చేరుతుందో ఆ ప్రభుత్వానికే తెలియాలి. ఇది నిన్న సచివాలయాల జాతర మాత్రమే.. ఇలాంటివి ఇంకెన్ని పథకాలున్నాయో.. ఇంకెన్ని ప్రకటనలు చూడాలో!! 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle