newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

రాజుగారు మనసెందుకు మార్చుకున్నారు?

11-03-201911-03-2019 17:19:36 IST
2019-03-11T11:49:36.442Z11-03-2019 2019-03-11T11:31:06.484Z - - 26-06-2019

రాజుగారు మనసెందుకు మార్చుకున్నారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయనగరం లోక్‌సభ సీటు నుంచి తాను పోటీ చేయనన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు... ఇప్పుడు పోటీకి ఎందుకు ఒప్పుకున్నారు. తన కుమార్తెను బరిలో దింపుతానన్న ఆయన... మళ్లీ మనసు ఎందుకు మార్చుకున్నారు. ఇంతకీ విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో అశోక్ గజపతి రాజు ఏం మాట్లాడారు. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే... ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్న అశోక్ గజపతి రాజు... విజయనగరం లోక్ సభ టిక్కెట్ తన కుమార్తె అతిధి గజపతి రాజుకు ఇవ్వాలన్నారు. వారం రోజుల క్రితం దాకా ఇదే చర్చ టీడీపీలో నడిచింది. 

అయితే విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా సమాధానాలు ఇచ్చారట అశోక్ గజపతి రాజు. ఆయన అడిగిన మూడు ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానం కరువైందట. ఇంతకీ అశోక్ గజపతి రాజు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా. ఈ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ వెళ్లి ఏం చేయాలి బాబుగారు?... అని రాజుగారు అడిగారట. మళ్లీ మోడీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అర్థం అవుతోంది. మోడీతో మనం గొడవ పెట్టుకున్నాం. ఇలాంటి సమయంలో ఢిల్లీలో కూర్చుని ఏం చెయ్యాలన్నది అశోక్ గజపతి ప్రశ్న. 

ఇక రెండో ప్రశ్న ఏంటంటే... తాను కేంద్ర విమానయాన శాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి పర్మిషన్ తెస్తే... దాన్ని రద్దు చేయింది జీఎంఆర్ సంస్థకు విమానాశ్రయ పనులు అప్పగింత ఎందుకు చేశారు? నియోజకవర్గ ప్రజలకు దీనిపై ఏం సమాధానం చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారట అశోక్ గజపతి రాజు. ఇక మూడో ప్రశ్న ఏంటంటే... ప్రత్యేక హోదా మీద వైసీపీ ఉద్యమం చేసిన తర్వాతే టీడీపీ హోదా అంశం ఎత్తుకుందనీ... ఇప్పుడు జనం ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటే, ఏం సమాధానం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని ప్రశ్నించారట అశోక్.

ఈ మూడు ప్రశ్నలతో కంగుతిన్న చంద్రబాబు... గతంలో జరిగింది పట్టించుకోవద్దనీ, ఎన్నికల సమయంలో అందరం కల్సి కట్టుగా ఉంటేనే గెలుస్తామని అశోక్ గజపతి రాజుకు సర్ది చెప్పారట. దీంతో విజయనగరం ఎంపీ సీటు నుంచి పోటీకి ఒప్పుకున్న అశోక్ గజపతి రాజు... జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ సీటు తన కుమార్తెకు కేటాయించాలని మెలిక పెట్టారట. ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చగా మారింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle