newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

రాజీనామా ఉండ‌దు.. అన‌ర్హ‌త వేటు ప‌డ‌దు.. వంశీ ప‌క్కా వ్యూహం..!

18-11-201918-11-2019 06:23:20 IST
Updated On 18-11-2019 12:18:14 ISTUpdated On 18-11-20192019-11-18T00:53:20.273Z18-11-2019 2019-11-18T00:53:03.264Z - 2019-11-18T06:48:14.638Z - 18-11-2019

రాజీనామా ఉండ‌దు.. అన‌ర్హ‌త వేటు ప‌డ‌దు.. వంశీ ప‌క్కా వ్యూహం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజ‌కీయం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ప‌ద‌వికి వంశీ రాజీనామా చేస్తారా, ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకుంటారా, వంశీ వెంట‌నే ఇంకా ఎవ‌రైనా టీడీపీ ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు వ‌స్తారా అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ద‌మ్ముంటే తెలుగుదేశం పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆ పార్టీ నేత‌లు వంశీకి స‌వాళ్లు విసురుతున్నారు.

మ‌రోవైపు ఇత‌ర పార్టీల నేత‌లు త‌మ పార్టీలో చేరాలంటే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియ‌మం పెట్టుకున్నారు. పార్టీ ఫిరాయిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తున్నారు.

అయితే, వంశీ మాత్రం ప‌ద‌వికి రాజీనామాపై దాట‌వేత ధోర‌ణి అవ‌లంభిస్తున్నారు. దీని వెనుక ప‌ద‌వి కోల్పోకుండా ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేయ‌క‌ముందే ఆ పార్టీపై వంశీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో టీడీపీ నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు.

దీంతో వంశీని స్వ‌తంత్రుడిగా గుర్తించే అవ‌కాశం ఉంది. స్పీక‌ర్ కూడా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇక‌, జ‌గన్‌కు, ఆయ‌న పాల‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్పిన వంశీ ఎప్పుడు వైసీపీలో చేరేది చెప్ప‌కుండా తెలివిగా వ్య‌వ‌హ‌రించారు.

అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అధికారికంగా వైసీపీలో చేర‌డం లేదా వైసీపీ పార్టీ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొనే వ‌ర‌కు వంశీని ఆ పార్టీ చేరిన‌ట్లు తెలుగుదేశం రుజువు చేయ‌లేదు. ఇలా రుజువు చేయ‌నిదే ఆయ‌న‌పై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి, కొంత‌కాలం వ‌ర‌కు ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా, వైసీపీలో అధికారికంగా చేర‌కుండా ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు వైసీపీలో, గంటా శ్రీనివాస‌రావు ఆధ్వ‌ర్యంలో కొంద‌రు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాబ‌ట్టి, వారంద‌రి వైఖ‌రి ఎలా ఉంటుందో చూసే తాను కూడా ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని వంశీ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అంత‌వ‌ర‌కు వైసీపీలో కూడా ఆయ‌న అధికారికంగా చేరే అవ‌కాశాలైతే లేవు.

ఇక‌, ఇదే స‌మ‌యంలో త‌న‌ను రాజీనామా చేయాల‌ని టీడీపీ విసురుతున్న స‌వాళ్ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు వంశీ. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై ముందు అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బీజేపీకి ఎలాగైనా ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మేర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని అడ‌గ‌దు. ఈ విష‌యం తెలిసే వంశీ తెలివిగా ఈ అంశాన్ని లేవ‌దీస్తున్నారు.

అయితే, ఎమ్మెల్యే ప‌దవి త‌న‌కు వార‌స‌త్వంగా రాలేద‌ని, ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డం త‌న‌కు కొత్త కాద‌ని వంశీ ప్ర‌క‌టిస్తున్నారు. ముహూర్తం చూసుకొని Mla పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. ఇవ‌న్నీ దాట‌వేత కోసమే మాట్లాడుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. త‌న‌పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా, ఇప్ప‌ట్లో రాజీనామా కూడా చేయ‌కుండా అన‌ధికారికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా వంశీ కొన‌సాగ‌నున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle