newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

రాజన్న పాలన కాదు రాక్షసపాలన...‘చంద్ర’ నిప్పులు

07-09-201907-09-2019 08:44:04 IST
2019-09-07T03:14:04.256Z07-09-2019 2019-09-07T03:13:46.615Z - - 05-08-2020

రాజన్న పాలన కాదు రాక్షసపాలన...‘చంద్ర’ నిప్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలనపై అధికారపక్షం హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు మాత్రం నిప్పులు చెరుగుతున్నాయి. రాష్ట్రంలో దుర్మార్గమైన, రాక్షస పాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఇంత పనికిమాలిన ప్రభుత్వం తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలన అప్రతిష్ఠను మూటకట్టుకుందని చంద్రబాబు అన్నారు. ఇది విధ్వంసకర ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వందరోజుల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న సీఎం చరిత్రలో మరొకరు లేరని విమర్శించారు. నెలలు గడుస్తున్నా తన బాబాయిని ఎవరు హత్య చేశారో తేల్చలేదని అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని చంపాలని చూస్తున్నారని... ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని ఆరోపించారు. 

వైఎస్, విజయభాస్కర్ రెడ్డి ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినప్పటికీ... వారు దాన్ని జిల్లాలకే పరిమితం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా చేయాలని చూస్తున్నారని, దానిని చూస్తూ ఊరుకోబోమన్నారు. 

వైసీపీకి క్యాడర్ లేదని... అందుకే టీడీపీ క్యాడర్‌ను ధ్వంసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతిపక్షాన్ని నాశనం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారు. 

తన మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, తన ఇంటిని డ్రోన్ కెమేరాలతో  చిత్రీకరించడం, సెక్యూరిటీను తగ్గించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము జగన్ పాదయాత్రకు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ ఇచ్చామన్న చంద్రబాబు...నా ఇల్లు ముంచే రాజకీయాలు చేసి అప్రతిష్ట పాలయ్యారని మండిపడ్డారు. పోలీసులు తమ విధులు సరిగా నిర్వర్తించడం లేదన్నారు. అన్యాయం జరిగిందని, తమకు. న్యాయం కావాలని అడిగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో టీడీపీ నాయకుల ఇళ్లు, షాపులపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేతల ఇళ్ల వైపు వెళ్తూ... మందు బాటిళ్లను ఆ ఇళ్లపైకి విసిరేశారు. దగ్గర్లోని షాపుల అద్దాల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు పెద్ద గాయాలయ్యాయి.

ఇలాగైతే తాము బతకలేమనీ... తమను చంపేస్తున్నారనీ... బాధితులు లబోదిబో మంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు... అక్కడ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.ఇలాంటి దాడులపై నిన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. బాధితుల్ని కలిసిన ఆయన... కొత్త ప్రభుత్వం రాజన్న రాజ్యం తెస్తుందని అనుకుంటే రాక్షస రాజ్యం తెచ్చిందని విమర్శించారు. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   43 minutes ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle