newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

27-01-202027-01-2020 15:05:23 IST
2020-01-27T09:35:23.376Z27-01-2020 2020-01-27T09:35:04.498Z - - 26-02-2020

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాను అనుకున్నదానిని నెరవేర్చడానికి సీఎం జగన్ వెనుకాడడం లేదు. ఇటీవల మండలి పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో వున్న జగన్ అసలు మండలినే లేకుండా చేయాలని నిర్ణయించారు. ఇలాంటి మండలి మనకు అవసరమా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. తాజాగా మండలి రద్దుకి తీర్మానం చేయడానికి సిద్ధం అయ్యారు. 

తన మాట నెగ్గించుకోవడానికి ఏపీ సీఎం జగన్‌ ఎంతకైనా వెళ్తారని.. శాసనమండలి రద్దు అంశం ఇదే కోవకు చెందుతుందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. కింద సభలో పొరపాట్లకు తావు లేకుండా పెద్దల సభ ఏర్పాటు చేశారని నా కంటే పెద్దలు ఎవరున్నారని జగన్‌ భావిస్తున్నారని రాధా ఎద్దేవా చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరులో రైతులు చేస్తున్న మహాధర్నాకు రాధా హాజరై తన సంఘీభావం తెలిపారు.

ఎక్కడ సీఎం కూర్చొంటే అక్కడే పరిపాలనా పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పాడని, ఇంతమంది ఆందోళన చేస్తుంటే సీఎం చెవికెక్కడం లేదా..? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యమంటే ఇంతమంది రైతులను పొట్టన పెట్టుకోవడమా..? రాజన్న రాజ్యమంటే ఆడపడుచులను ఉసురుపెట్టడమా..? అని మండిపడ్డారు. భవిష్యత్‌లో జగన్‌కు రివర్స్ ఓటు తప్పదన్నారు. 

రాజధాని సమస్య రైతుల సమస్య కాదని, ఇది యావత్ రాష్ట్ర ప్రజలందరి సమస్య అన్నారు. గతంలోనూ తాను అమరావతి ఆందోళనలకు మద్దతిచ్చానని, ఇక్కడ రైతులకు తన మద్దతు ఉంటుందన్నారు.  రాజధాని ఉద్యమం పార్టీలు, కుల, మతాలకు అతీతంగా సాగుతోందని,  ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేలా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle