newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

రాజధానుల రగడ.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

25-12-201925-12-2019 12:28:23 IST
Updated On 26-12-2019 11:45:16 ISTUpdated On 26-12-20192019-12-25T06:58:23.602Z25-12-2019 2019-12-25T06:58:01.297Z - 2019-12-26T06:15:16.139Z - 26-12-2019

రాజధానుల రగడ.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడురాజధానుల అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు పాలక పక్షం వైసీపీ జగన్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇటు విపక్షం టీడీపీ,బీజేపీ, జనసేనలు మూడురాజధానుల ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలో రైతుల దీక్షలు, నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన అభిప్రాయం వెలిబుచ్చారు. 

కృష్ణాజిల్లా ఆత్కూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా తో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణను తాను మొదటి నుంచి కట్టుబడి ఉన్నానని, రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థ లను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు తాను ప్రత్యేకం గా చొరవ  తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూశానన్నారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఈ విధంగా జరగాలన్నారు. ప్రభుత్వ పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయం అని.. రాజకీయాలకు తాను దూరంగా ఉండి ఈ మాటలు అంటున్నానన్నారు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్క చోటనే ఉండడం మంచిదన్నారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని, ప్రజలకు ఇబ్బందుల కలగకుండా ఉంటాయన్నారు వెంకయ్యనాయుడు.

తన 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెబుతున్నానని, వివాదాల కోసమో, రాజకీయం కోణం లోనో నా అభిప్రాయం చూడవద్దని వెంకయ్యనాయుడు సూచించారు.కేంద్రం తనను అభిప్రాయం కోరితే ఇదే విషయం చెబుతానన్నారు. ఏపీలో ఇంగ్లీషు మీడియం విద్య గురించి కూడా వెంకయ్యనాయుడు మాట్లాడారు.

మాతృభాషకు ప్రాధాన్యం విషయంలో తన మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అనీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలనేదే తన అభిప్రాయం అన్నారు. ప్రధాని సైతం మాతృ భాషకు ప్రాధాన్యంపై అనేక సార్లు చెప్పారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle