newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

రాజధానుల రగడపై విస్తృత చర్చ

30-12-201930-12-2019 15:46:29 IST
Updated On 30-12-2019 16:01:47 ISTUpdated On 30-12-20192019-12-30T10:16:29.896Z30-12-2019 2019-12-30T10:15:14.527Z - 2019-12-30T10:31:47.920Z - 30-12-2019

రాజధానుల రగడపై విస్తృత చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధాని మార్పుకు సంబంధించిన రగడ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజాసంఘాలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. అమరావతి రాజధానిని మార్చేందుకు వీలు లేదని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని వివరాలను తెలిపే సమాచారం ఉన్న పుస్తకాన్ని విడుదలచేసిన పవన్ వాటిని  సభ్యులకు అందచేశారు.

ఈ భేటీలో మూడు రాజధానుల అంశం, రైతుల సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.  వీటితో పాటుగా జనసేన కమిటీ సభ్యులు అమరావతిలో పర్యటించి ఓ నివేదికను తయారు చేశారు. 

ఆ నివేదికపై కూడా చర్చ జరుగుతోంది. రాజధాని అంశంపై పార్టీకి చెందిన నేతల అభిప్రాయాలను పవన్ తెలుసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మూడు రాజధానుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.

విశాఖ, కర్నూలును కాదంటే జనసేన కార్యకర్తలను నొప్పించినట్టు అవుతుందని పవన్ భావిస్తున్నారు. ఇవాళ్టి సమావేశంలో రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించి ఆందోళన చేస్తున్న రాజధాని రైతులతో మాట్లాడతానని పవన్ చెప్పారు. జగన్ నిర్ణయం జనసేనకు సంకటంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle