newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

రాజధాని రైతులపైనా కనికరం కరవేనా?

28-09-201928-09-2019 15:14:35 IST
Updated On 28-09-2019 16:45:53 ISTUpdated On 28-09-20192019-09-28T09:44:35.268Z28-09-2019 2019-09-28T09:44:31.860Z - 2019-09-28T11:15:53.682Z - 28-09-2019

రాజధాని రైతులపైనా కనికరం కరవేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైకాపా సర్కార్ వైఖరి అంతా తాము విపక్షంలో ఉన్న కాలంలో తమ మాట వినని వారిపై కక్ష సాధింపే లక్ష్యంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నది. నాడు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు కారణం రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

రైతులు రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చి ప్రతిగా గత ప్రభుత్వం నుంచి పొందిన ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంలో లేదు. దీంతో రాజధాని రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్లాట్ల పై బ్యాంకు రుణాలు తీసుకుని ఆర్థిక కష్టాల నంచి గట్టెక్కుదామన్న వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకోవాలన్నవారి ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. 

ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్లాట్లపై రుణాలు ఇవ్వాలంటే తమకు అనుమతి రావాలని, అటువంటి అనుమతి ఏదీ ఇప్పటి వరకూ రాలేదనీ బ్యాంకు అధికారులు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని కోసం తమ భూములను ఇవ్వడమే పాపమా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు తమకు హామీ ఇచ్చిందీ రాష్ట్ర ప్రభుత్వమే, ఇప్పుడు పట్టించుకోకుండా విదిలించి పారేస్తున్నదీ రాష్ట్ర ప్రభుత్వమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే విధానాలు మారిపోతాయా? అని ప్రశ్నిస్తున్నారు. 

రాజకీయంగా తెలుగుదేశం, వైకాపాలకు వైరుధ్యాలు, శతృత్వం ఉంటే ఉండొచ్చు కానీ...ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకు రుణాలు ఇచ్చేది లేదని అనడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. అయినా రాజధాని రైతుల ఆవేదన అరణ్య రోదనగానే ఉంది. గత ప్రభుత్వానికి తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చినందుకే ఇప్పుడిలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు చేస్తున్న ఆరోపణ సబబుగానే ఉంది. నాటి తెలుగు దేశం ప్రభుత్వానికి రైతులు భూములేమీ ఉదారంగా, ఉచితంగా ఇచ్చేయ లేదు.

తమ భూమికి తగిన విలువను రానున్న రోజులలో..అంటే రాజధాని నిర్మాణం పూర్తయ్యే నాటికి వస్తుందన్న భరోసా ఇస్తేనే ఇచ్చారు. భూమిని డెవలప్ చేసి ప్లాట్ల రూపంలో ఇస్తామని నాడు ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకే తాము భూములిచ్చామని, అదే విధంగా భూమిని డెవలప్ చేసి నాటి ప్రభుత్వం తమకు ప్లాట్లు ఇచ్చిందని రైతులు చెబుతున్నారు. నాటి ప్రభుత్వ విధానాలన్నిటినీ తిరగదోడడమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా సర్కార్ ఇప్పుడు రాజథాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తూ...రాజధాని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్యెల్యే, అధికారులు, సీఆర్డీయే కమిషనర్ ఇలా అందరినీ కలిసి వినతిపత్రాలు సమర్పించినా వారి నుంచి ఎటువంటి హామీ లభించక రైతులు అల్లాడిపోతున్నారు. ఉభయ తారకంగా అటు రాష్ట్రానికి అద్భుత రాజధాని వస్తుంది, ఇటు తమకు కూడా  భూమి ఇవ్వడం వల్ల లబ్ధి చేకూరుతుందన్న ఆశతోనే నాడు ప్రభుత్వానికి భూమి అప్పగించామని, తీరా ఇప్పుడు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని రాజధాని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఇప్పటికైనా తమకు తమ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే న్యాయం కోసం ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. వైకాపా విపక్షంలో ఉన్న సమయంలో ల్యాండ్ పూలింగ్ ను గ్యాంబ్లింగ్ అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైకాపా మద్దతు దారులైన రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూములివ్వడానికి వెనుకాడినా...తరువాత తరువాత వారు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో తమ భూములను ఇచ్చారు. 

రాజధాని పరిధిలోని ఒకటి రెండు గ్రామాల రైతులు మాత్రమే ఇందుకు వ్యతిరేకంగా నిలిచారు. కోర్టులను ఆశ్రయించారు. ఆయా గ్రామాలన్నీ వైకాపా ప్రాబల్య గ్రామలనిన అప్పట్లో తెలుగుదేశం విమర్శలు గుప్పించింది. తీరా ఇప్పుడు రాష్ట్రంలో వైకాపా అధికారంలోనికి వచ్చిన తరువాత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన వారి పరిస్థితి ‘త్రిశంకు స్వర్గం’ లో ఉన్నట్లుగా తయారైంది.  ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle