newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

17-02-202017-02-2020 11:19:12 IST
2020-02-17T05:49:12.964Z17-02-2020 2020-02-17T05:49:10.321Z - - 07-04-2020

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవ్యాంధ్ర కలల రాజధానిగా ఉన్న అమరావతిని ఎత్తి కుదేలు వేసిన వైకాపా ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కేంద్రం ఆమోదం కోసం పాట్లు పడుతూనే ఉంది. అది ఆచరణ రూపం దాలుస్తుందో లేదు స్పష్టం కావటం లేదు కానీ విశాఖ రియల్టర్ల స్వర్గధామంగా మారిపోయింది. రాజధానిని అమరావతి నుంచి మార్చి విశాఖకు తరలిస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించినప్పటినుంచి విశాఖలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, స్థలాల రేట్లకు రెక్కలు వచ్చేశాయి. ఇక ఔత్సాహికుల్లో ఆస్తుల కొనుగోలుపై ఆసక్తి రెట్టింపైంది. రాజధానిలో తమకూ ఇల్లు, స్థలం ఉందని చెప్పుకోవచ్చనే ఆశ రియల్టర్లను, మధ్యతరగతి ప్రజలను కూడా విశాఖవైపు పరుగులెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఫుల్‌ హుషార్‌ ఏర్పడింది.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం స్తబ్దుగా వున్న సమయాన, పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు కూడా లావాదేవీలు తగ్గాయే తప్ప ధరలు మాత్రం దిగిరాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌) ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో స్థిరాస్తి వ్యాపారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భూములు, ఫ్లాట్లకు మంచి గిరాకీ వస్తుందని, అధిక ధరలకు విక్రయించుకోవచ్చని భావిస్తున్నారు. 

చాలామంది అప్పుడే భీమిలి, ఆనందపురం, పెందుర్తి, పరవాడ, భోగాపురం, సబ్బవరం ప్రాంతాల్లో భూములు లభిస్తే కొనడానికి తిరుగుతున్నారు. దొరికితే కొంటున్నారు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం సాధారణ స్థాయిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే బిల్డర్లు అమ్ముడు పోకుండా మిగిలిన పోయిన ఫ్లాట్లు, విల్లాలు విక్రయానికి తరచూ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో అచ్యుతాపురం నుంచి తగరపువలస వరకు అన్నిచోట్ల అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ‘రెడీ టు ఆక్యుపేషన్‌’ కింద ఐదు వేలకు పైగా ఫ్లాట్లు సిద్ధంగా వున్నాయని క్రెడాయ్‌ విశాఖపట్నం చాప్టర్‌ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు మీడియాకు తెలిపారంటే రియల్ బూమ్ అక్కడ ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది.

విశాఖ శివార్లలో అటు అచ్యుతాపురం, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, ఇటు ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు రూ.2,500 నుంచి ధర పలుకుతోంది. వేయి చదరపు అడుగుల ఫ్లాట్‌ రూ.25 లక్షలకే దొరుకుతోంది. ఇక నగరానికి పది కిలోమీటర్ల దూరాన ఉన్న మధురవాడలో అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ధర ఉంది. ఇక్కడే ఎక్కువ సంఖ్యలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బిల్డర్లు ఇబ్బడిముబ్బడిగా నిర్మించడంతో డిమాండ్‌ లేక చాలాకాలంగా అమ్మకాలకు ఎదురుచూస్తున్నాయి. 

ఇప్పుడు కొనుగోలు చేస్తే ఈ ధరలకే లభిస్తాయి. రాజధాని తరలింపు, శంకుస్థాపన పనులు, అధికారుల రాక మొదలైందంటే...ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది. అమరావతి నుంచి విభాగాధిపతులు, వారి కార్యాలయాలు తరలివస్తే 20 వేల మంది ఉద్యోగులు వారి కుటుంబాలతో వచ్చే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ నివాసాలు అవసరం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం రుషికొండలో సచివాలయం వచ్చే అవకాశం ఉంది. అద్దెకు కూడా ఇక్కడ ఎక్కువ ఫ్లాట్లు ఉన్నాయి.  డబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.5 వేల నుంచి రూ.8వేలు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేలు అద్దె తీసుకుంటున్నారు. రాజధాని వస్తే ఈ అద్దెలు పెరగవచ్చు. 

ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు మొదలైతే.. భూముల ధరలకు రెక్కలు వచ్చినట్టే. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా వాయిదాల పద్ధతిలో ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రాపర్టీ షోలో తమ వెంచర్‌లో ప్లాటు, ఫ్లాటు కొంటే అర కిలో బంగారం ఇస్తామంటూ ఒక కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాపర్టీ షోలో 70 కంపెనీలు స్టాల్స్‌ ఏర్పాటు చేయగా 400 ప్రాజెక్టులకు సంబంధించిన ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మకానికి పెట్టారు. గత ఏడాది ఈ సంస్థ నిర్వహించిన ప్రాపర్టీ షోకి 40 వేల మంది హాజరు కాగా, ఈ ఏడాది రాజధాని ప్రకటన వెలువడిన నేపథ్యంలో సందర్శకుల సంఖ్య 50 వేలు దాటినట్టు నిర్వాహకులు తెలిపారు.

కాగా భీమిలిని మహాపట్టణంగా అభివృద్ధి చేయనున్నట్టు, భీమిలి నియోజకవర్గం అంతా రాజధాని కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్టు నాయకులు ప్రకటిస్తున్నారు. మధురవాడ, రుషికొండ, ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలన్నీ భీమిలి నియోజకవర్గంలోనే ఉన్నాయి.

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle