newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రాజధాని పేరుతో జగన్ భారీ కుట్ర.. బీజేపీ ఫైర్

21-01-202021-01-2020 16:57:32 IST
Updated On 22-01-2020 11:48:54 ISTUpdated On 22-01-20202020-01-21T11:27:32.485Z21-01-2020 2020-01-21T11:27:29.534Z - 2020-01-22T06:18:54.741Z - 22-01-2020

రాజధాని పేరుతో జగన్ భారీ కుట్ర.. బీజేపీ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజధానుల రగడ కొనసాగుతూనే వుంది. మూడురాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీ బిల్లుని ఆమోదించడంతో టీడీపీ, బీజేపీ, జనసేన మండిపడుతున్నాయి. బీజేపీ.. అటు జగన్ సర్కార్‌పై.. ఇటు చంద్రబాబుపై ఫైర్ అవుతోంది. ఏపీలో ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్రంపైన రుద్దొద్దన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. టీడీపీ శ్రేణులు అడుగుతున్నారని, తాము ఆ పాత్ర పోషిస్తే, టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అంటూ ప్రశ్నించారు.

అమరావతి ఏర్పాటు సందర్భంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ఎంపీ జీవీఎల్‌ కోరారు.రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని. కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలే అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని జీవీఎల్ మండిపడ్డారు.

మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానమన్నారు. అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదన్నారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఎప్పుడో కోరామని దానిని స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని వ్యవహారం కుటుంబ విధానం కాదని.. రాజ్యాంగ వ్యవస్థ అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అని తేల్చిచెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా అమరావతిలో రాజధాని పెట్టారన్నారు.

తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకపోతే.. వైసీపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతిలో జరిగిన దానికి టీడీపీ, వైసీపీదే సంపూర్ణ బాధ్యత అన్నారు. నాలుగు ఏళ్లలో చంద్రబాబు నాలుగు శాశ్వత భవనాలు కట్టలేకపోయారని, ప్రజాధనం వృధా చేశారన్నారు ఎంపీ జీవిఎల్. రాజధాని పేరుతో భారీకుట్ర జరుగుతోందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ నిర్ణయాలు ప్రజావ్యతిరేక విధానాలన్నారు కన్నా. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle