newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రాజధాని తరలింపునకు ఆగస్టు 15న ముహూర్తం

01-08-202001-08-2020 11:17:19 IST
Updated On 01-08-2020 13:48:38 ISTUpdated On 01-08-20202020-08-01T05:47:19.197Z01-08-2020 2020-08-01T05:45:40.413Z - 2020-08-01T08:18:38.550Z - 01-08-2020

రాజధాని తరలింపునకు ఆగస్టు 15న ముహూర్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని తరలింపునకు రంగం సిద్ధం అవుతోంది. ఆగస్టు 15 నాటికి విశాఖలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో పూజ నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అనంతరం దశలవారీగా విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జరగనుంది. మూడురాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో జగన్ ప్రభుత్వం వేగం పెంచింది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖను మార్చాలని ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ముహూర్తం కూడా ఖరారు అయిందనే సమాధానమే వినిపిస్తుంది. 

ఇటీవల విజయసాయి రెడ్డి దీనికి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెబుతున్నారు. విశాఖలో క్షేత్రస్థాయిలో పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక శుభ ముహూర్తం చూసుకొని నూతన రాజధానిని ప్రారంభించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నట్లే కనిపిస్తోంది జగన్ సర్కార్. మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని సీఎం జగన్ ప్రకటించినప్పటి నుండి విశాఖలో రాజధాని హంగామా ప్రారంభమైంది. 

విశాఖ నగరం పర్యాటకంగానే కాదు ఐటీ, ఫార్మా రంగాలతో పాటు హాస్పిటాలిటీ, టూరిజం, ఇండస్ట్రీయల్, కార్గో, సీ ఫుడ్స్ ఇలా పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. మరోవైపు వాయు, జల, రోడ్డు మార్గాలతో అన్ని నగరాలకు కనెక్టివిటీ ఉండటంతో విశాఖ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వైజాగ్ లో తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోకస్ కూడా పెరుగుతోంది.

దీంతో నగరంలో రాజధాని హంగు, ఆర్భాటాలు అప్పుడే కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తీ, కీరీటంలో విశాఖ మరో ఆభరణంగా వుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి సచివాలయం తరలించేందుకు ప్రభుత్వం వివిధ విభాగాల అధికారులతో సమాలోచనలు జరుపుతోంది. మూడురాజధానుల బిల్లు త్వరలో చట్టంకాబోతోంది. తాజా పరిణామాల పట్ల సీఎం జగన్ సంతోషంగా వున్నట్టు తెలుస్తోంది. 

 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   an hour ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   2 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   3 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   4 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   4 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   5 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   5 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   6 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   6 hours ago


తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle