newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

రాజధాని చుట్టూ రాజకీయం.. మాటల తూటాలు

26-11-201926-11-2019 15:44:59 IST
2019-11-26T10:14:59.696Z26-11-2019 2019-11-26T10:07:11.859Z - - 04-08-2020

రాజధాని చుట్టూ రాజకీయం.. మాటల తూటాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ ఇప్పుడు రాజకీయ పార్టీల గేమ్స్ సాగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వానొచ్చినా.. వరదొచ్చినా రాజధాని చుట్టూ కామెంట్స్ వెల్లువెత్తాయి. అది కాస్తా సమసిపోయాక ఇండియా మ్యాప్ లో ఏపీకి రాజధాని లేదంటూ మరో ఆసక్తికర వాదన రేగింది. దానికి మూడు రోజుల క్రితమే కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతూ సరికొత్త మ్యాప్ విడుదల చేయడంతో అది కూడా సమసిపోయింది.

ఇక ఇప్పుడు రాజధాని అమరావతిలో అధికార-ప్రతిపక్ష పార్టీలు సరికొత్త గేమ్స్ మొదలుపెట్టాయి. ఈనెల 28న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి గ్రామాలలో పర్యటించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న సందర్భంగా రాజధాని పరిస్థితిపై పరిశీలించేందుకు అయన పర్యటనకు వెళ్తున్నట్లుగా టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుండగా అధికార వైసీపీ నేతలు మాటల తూటాలాను పేల్చడమే కాక రివర్స్ గేమ్స్ కూడా మొదలుపెట్టినట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు పర్యటనపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏముందని రాజధాని పర్యటనకు చంద్రబాబు వెళ్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని శ్మశానంగా మార్చిన చంద్రబాబు తగుదునమ్మా అని పర్యటనకు వెళ్తున్నారని విమర్శలు చేశారు.

దీనికి కౌంటర్ గా టీడీపీ కూడా మాటల దాడికి దిగింది. ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుండి తరలించి దానికి అమరావతి అని పేరుపెట్టి ప్రధానితో శంఖుస్థాపన చేయించి.. స్వచ్ఛందంగా రైతుల వద్ద నుండి 33 వేల ఎకరాలను సేకరించి, తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన మొదలుపెట్టి శాశ్వత భవనాలకు పునాదులు వేశారని.. ఆరు నెలలలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టిందా అని ప్రశ్నించారు.

ఇక అధికార ప్రతిపక్షాలకు తోడు ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో కూడా కొత్తగా కొందరు గేమ్స్ మొదలుపెట్టారు. తాజాగా అమరావతి ప్రాంతంలో పర్యటించిన కొందరు వ్యక్తులు తాము రాజధాని రైతులమే అని.. చంద్రబాబు మూడేళ్ళకు తమ స్థలాలు కేటాయిస్తారని మోసం చేశారని.. తమ బినామీల కోసమే రాజధానిని పల్లపు ప్రాంతంలో మొదలు పెట్టారని విమర్శలతో చెలరేగిపోయారు.

మరోపక్క రాజధానికి భూములిచ్చిన రైతులంతా కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద విమర్శలకు దిగారు. రాజధాని చుట్టూ అసత్యపు ప్రచారం జరిగిపోతుందనని, ప్రభుత్వమే పనిగట్టుకొని ఈ ప్రచారానికి దిగిందని ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలోని ప్రజలలోనే వ్యతిరేకత తెచ్చారంటే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న మనకు రాజధాని విలువ తెలియడం లేదని దేశదేశాలలో అమరావతి ఓ బ్రాండ్ గా మారిపోయిందని తెలుసుకోవాలన్నారు.

ఇక చంద్రబాబు రాజధాని ప్రాంత పర్యటనకు ఏర్పాట్లు జరుగుతుండగానే మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ పరిధిలోని రైతులంతా ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. త్వరలోనే సీఆర్డీఏ పరిధిలో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇప్పటికే రసకందాయంలో పడిన క్యాపిటల్ గేమ్స్ చంద్రబాబు పర్యటన మరో రెండు రోజుల సమయం ఉండగా ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా మారుతుందో చూడాల్సి ఉంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle