newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

18-01-202018-01-2020 15:06:22 IST
2020-01-18T09:36:22.462Z18-01-2020 2020-01-18T09:36:19.281Z - - 26-02-2020

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈనెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని సమీప గ్రామాల్లో ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. 29 గ్రామాల పరిధిలో ఆంక్షలు అమలుచేయనున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సమావేశాల సమయంలో స్థానికులు..రైతులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

ఇప్పటికే సచివాలయానికి వెళ్లే దారిలో మందడం..వెలగపూడి గ్రామాల్లో నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి హాజరయ్యే స్పీకర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. 

కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును గతంలో ఏర్పాటు చేశారు. కానీ ఈమధ్యకాలం వరకూ ఆ రోడ్డును పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మతులు చేస్తున్నారు. అవసరమయితే వీఐపీలను ఈ మార్గంలో పంపించే ఏర్పాట్లు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతులకు ముందస్తు నోటీసులు అందచేశారు పోలీసులు.

ఈ నెల 20న ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని..ఛలో అసెంబ్లీ, జైల్ భరో వంటి కార్యక్రమాలకు పిలుపునిస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు. గ్రామాల రైతులు, నేతలతో పాటు జేఏసీ బాధ్యులకు కూడా ఈ నోటీసులు అందచేస్తున్నారు. సమావేశాలు జరిగే రోజున ఎటువంటి ఆందోళనలకి అనుమతి లేదన్న పోలీసులు..ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 29 గ్రామాల్లో రైతులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలకి నోటీసులు జారీచేశారు. కీలక నేతల కదలికలను పోలీసులు ఓ కంట గమనిస్తున్నారు. 

ఇటు ఆందోళనలకు దిగిన రైతులు, మహిళలపై పోలీసుల తీరు పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ మహిళలను బూటుకాలితో తన్నిన వైనంపై హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ, రాజధాని గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయడంపై హైకోర్టులో పలువురి నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుగుతోంది.

రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీసుల యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషయాలపై రాజధాని మహిళలు, న్యాయవాదులు, రైతులు మొత్తం ఏడు పిటిషన్లు వేశారు. వీటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటాగా స్వీకరించారు. అనవసరంగా 144 సెక్షన్ ను విధించరాదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ యథేచ్ఛగా ఈ సెక్షన్, పోలీస్ యాక్ట్ లను విధించడం వాటిని దుర్వినియోగం చేయడమేనంటూ హైకోర్టు పోలీసులను తప్పు పట్టిన సంగతి విదితమే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle