newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ

14-12-201914-12-2019 11:10:49 IST
Updated On 14-12-2019 11:51:50 ISTUpdated On 14-12-20192019-12-14T05:40:49.970Z14-12-2019 2019-12-14T05:40:45.527Z - 2019-12-14T06:21:50.317Z - 14-12-2019

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని అమరావతిపై సస్పెన్స్

జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అయోమయం

బొత్స ప్రకటనతో మరింత గందరగోళం

అమరావతి ఉంటుందా.. మరో చోటికి రాజధాని తరలిపోతుందా?

అమరావతి ప్రాంత వాసుల్లో ఆందోళన

ఆగిపోయిన నిర్మాణాలు... ఊడిపోయిన ఉద్యోగాలు

భవన నిర్మాణ కార్మికుల పస్తులు... ఆత్మహత్యలు

శాసనమండలిలో ప్రభుత్వ ప్రకటనతో ఉత్కంఠకు తెర 

అమరావతి తరలింపు ఉండదని వివరణ

అమరావతి విషయంలో నెలకొన్న ప్రతిష్టంబన తొలగిపోయినట్టేనని స్పష్టం అవుతోంది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి వేరే చోటుకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని ప్రభుత్వం తేల్చేసింది. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చింది. శాసనమండలి సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు పమిడి శమంతకమణి, గునపాటి దీపక్ కుమార్, పర్చూరి అశోక్ బాబు.. రాజధాని తరలింపు అంశంపై మండలిలో పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రశ్నలు వేయగా.. అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదంటూ ఆయన లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.

దీంతో అమరావతి అభివృద్ధికి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతి తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని కేంద్రం కూడా జగన్ సర్కార్‌కు స్పష్టం చేసింది.

టీడీపీ, జనసేన సైతం అమరావతి రైతులతో ముఖాముఖి నిర్వహించాయి. ప్రజారాజధాని అమరావతి నిర్మాణాలకు అనుకూలంగా లేదని. వర్షాలు వస్తే మునిగిపోతుందని, నిపుణుల కమీటీ రాష్ట్రమంతా పర్యటించి.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో అన్న దానిపై సమగ్రమైన నివేదిక ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో మరింత ఆందోళన వ్యక్తం అయింది. 

ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సర్వే కూడా పూర్తయింది. ఇక కొద్దిరోజుల్లో వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తుందని భావిస్తున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాల్లో లిఖితపూర్వకంగా రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచన లేదని మరోసారి స్పష్టం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు ప్రభుత్వ సమాధానంతో ఊరట పొందుతున్నారు. ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle