newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

రాజధానిలో నిర్మాణాలపై సీఎం జగన్ కీలక ప్రకటన..

26-11-201926-11-2019 09:17:00 IST
Updated On 26-11-2019 14:48:50 ISTUpdated On 26-11-20192019-11-26T03:47:00.262Z26-11-2019 2019-11-26T03:46:58.416Z - 2019-11-26T09:18:50.822Z - 26-11-2019

రాజధానిలో నిర్మాణాలపై సీఎం జగన్ కీలక ప్రకటన..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్నెల్ల తర్వాత రాజధానిపై నోరు విప్పిన ఏపీ సీఎం.

రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కీలక ప్రకటన

అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలి

క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా పనులు పూర్తి చేయాలి.

పూర్తి కావొస్తున్న నిర్మాణాలపైనే ముందుగా దృష్టి పెట్టాలి.

నిధులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం.

రాజధానిలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి.

అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లుగా ప్రతిపక్షాలు, ప్రత్యేకించి టీడీపీ, జనసేన చెవిలో జోరీగలా రాజధాని గురించి విమర్శల దాడి చేస్తున్నప్పటికీ చలించని, రాజధానిపై తన అభిప్రాయం చెప్పని ముఖ్యమంత్రి ఎట్టకేలకు రాజధానిలోని నిర్మాణాలపై అధికారులకు స్పష్టత నిస్తూ వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

సోమవారం సీఆర్‌డీఏపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మినరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ప్రాధాన్యత క్రమంలో పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాల విషయంలో అనవసర ఖర్చులకు పోకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తి కావొస్తున్న నిర్మాణాలపై ముందు దృష్టిపెట్టాలని.. ఇందుకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్‌ స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌ వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని తెలిపారు.

సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్‌ల గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులు ఉండకూడదని సూచించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో, ఖర్చు, డిజైన్ల తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. 

రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసి సుందరీకరించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో వ్యయం తగ్గించి.. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

అమరావతిని తరలిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని బీడు చేస్తున్నారు అంటూ ఇన్ని నెలలుగా ప్రతిపక్షాలు చేస్తూ వచ్చిన విమర్శలకు, దాడులకు సీఎం వైఎస్‌ జగన్ ఒకే ఒక్క ప్రకటనతో తెర దించారు. రాజధానిగా అమరావతి ఉనికిలో ఉంటుందన్న భరోసాను గత ఆరునెలల పాలనలో తొలిసారిగా జగన్ భరోసానివ్వడం ఇదే తొలిసారి కావడంతో ఇన్నాళ్ల ఉత్కంఠ కాస్త తొలగినట్లయింది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle