newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

రాజధానిలో ధర్నాకు బాబు మద్దతు....జగన్‌కు సిగ్గుందా అని ఎద్దేవా

01-01-202001-01-2020 17:01:51 IST
2020-01-01T11:31:51.945Z01-01-2020 2020-01-01T11:31:48.718Z - - 15-08-2020

రాజధానిలో ధర్నాకు బాబు మద్దతు....జగన్‌కు సిగ్గుందా అని ఎద్దేవా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 నూతన సంవత్సరం వేళ అమరావతి రైతులు ధర్నాలతో 2020వ సంవత్సరానికి స్వాగతం పలికారు.అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఆయనే కాదు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎర్రబాలెం రైతుల నిరసన దీక్షలో దంపతులిద్దరూ కూర్చుని రైతులకు మద్దతు తెలిపారు. 

ఈసందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన స్థానికులతో సంభాషించారు. ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలను పట్టించుకోలేదని, ట్రాన్స్ లో పడి జగన్ కు ఓటేసి ఫలితం అనుభవిస్తున్నారన్నారు. తాను నిర్మించిన ప్రజా వేదికను కూల్చితే మనకెందుకు అనుకున్నారని, అమరావతిలో తన ఇల్లు ముంచే ప్రయత్నం చేస్తే బాబు సొంత గొడవ అనుకున్నారన్నారు. తన దాకా వస్తే గానీ తెలీదు అన్నట్టుగా రాజధాని విషయం వచ్చే సరికి మీకు ఆందోళన మొదలైందన్నారు. మీకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు చంద్రబాబు.

దక్షిణాఫ్రికా మోడల్ అంటున్న జగన్ ప్రపంచంలో ఏ దేశానికైనా, రాష్ట్రానికీ మూడు రాజధానులు లేవన్న సంగతి తెలియదా అని చంద్రబాబునాయుడు అన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖ ప్రజల ఆస్తులు కొట్టేయాలని వైసీపీ నేతలు కాచుకుని కూర్చున్నారని అన్నారు. అమరావతిలో అన్నీ ఉన్నాయి ఇక డబ్బు ఎందుకని ప్రశ్నించారు.

అమరావతిలో పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న ఆయన అమరావతిని మార్చే అధికారం మీకు లేదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో ఏ సీఎం అయినా రాజధాని మార్చారా అని ఆయన ప్రశ్నించారు. ఖైదీ నెంబర్ 6093 అంటే ప్రజలందరికీ తెలిసిందన్నారు. తాను వద్దు వద్దంటున్నా అవినీతిలో మునిగిపోయిన వారికి ఓట్లేశారని, ఒక్క అవకాశం అంటే మోసపోయారన్నారు. 

అమరావతిలో ఒక కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, అక్కడ వెనుకబడిన కులాలు 75శాతం ఉన్నాయన్నారు. కారుణ్య మరణాలు చేసుకునేందుకు అనుమతివ్వాలని రాజధాని ప్రాంత రైతులు అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అసలు ఈ సీఎంకు సిగ్గుందా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు ధైర్యంగా ముందుకెళ్తే జగన్ పులివెందులకు పారిపోవడం ఖాయమన్నారు. అర్ధరాత్రి వచ్చి రైతులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యముంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తు చేయాలని సవాల్ విసిరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle