newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

‘రాజధాని'పై ఉద్యోగుల్లో ఆందోళన... తట్టాబుట్టా సర్దాల్సిందేనా?

20-12-201920-12-2019 09:49:25 IST
Updated On 20-12-2019 10:35:06 ISTUpdated On 20-12-20192019-12-20T04:19:25.232Z20-12-2019 2019-12-20T04:18:53.407Z - 2019-12-20T05:05:06.597Z - 20-12-2019

‘రాజధాని'పై ఉద్యోగుల్లో ఆందోళన... తట్టాబుట్టా సర్దాల్సిందేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడు రాజధానుల ముచ్చట అధికార పార్టీ నేతల్లో సంబరాలు నింపుతుండగా.. విపక్షం, ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. సౌతాఫ్రికా మాదిరిగా మ‌న‌కూ మూడు రాజ‌ధానులు ఉంటే మంచిద‌నిపిస్తోందని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు క‌ర్నాలులో ఏర్పాటు చేసుకుని జ్యుడీషియ‌రీ క్యాపిట‌ల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గా విశాఖ‌, లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ గా అమ‌రావ‌తిని ఏపీకి మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

విశాఖపట్నం కు మెట్రో రైలు తీసుకొచ్చి త‌క్కువ ఖ‌ర్చుతోనే అభివృద్ధి తీసుకొచ్చేలా క‌మిటీని వేశాం. దీనిపై రెండు కంపెనీలు స్ట‌డీ చేస్తున్నాయి. వారిచ్చిన రిపోర్టుల ఆధారంగా మంచి నిర్ణ‌యం తీసుకుని భ‌విష్యత్ త‌రాలకు మేలు చేయాల‌ని భావిస్తున్నామని ప్రకటించారు.

2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. మన ప్రాంతంలో మన రాజధాని ఉద్యోగులు ఉండాలంటూ అప్పటి సీఎం చంద్రబాబు ఉద్యోగులను కూడా అమరావతి, విజయవాడలకు మార్చారు. ఇక్కట్ల మధ్యే అమరావతికి పయనమయ్యారు ఉద్యోగులు, అధికారులు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు కొంత వెసులుబాట్లు ఇచ్చింది సర్కారు. వారంలో ఐదురోజుల పనిదినాలు, ప్రత్యేక రైలు, విజయవాడలో ఉచిత వసతి కల్పించారు. ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ వెళ్ళే ఉద్యోగులు సోమవారం ఉదయం ప్రత్యేక రైలు ద్వారా అమరావతికి వచ్చేవారు. 

‘‘విశాఖలో పరిపాలనా రాజధాని ఉండొచ్చు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయవచ్చు. అమరావతిలో చట్టసభలను కొనసాగించవచ్చు'' అంటూ సీఎం జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. 'ఉండొచ్చు' అనే మాటే నిజమైతే తాము తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా అంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.  ఇప్పటికే కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఉద్యోగులు సచివాలయం విశాఖకు తరలిస్తే తాము విశాఖలో, కుటుంబాలు, విజయవాడ, హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తుందంటున్నారు.

పిల్లల చదువులు, సొంత ఇళ్లు, ఇతర అవసరాల రీత్యా హైదరాబాద్‌ లో కుటుంబాలను ఉంచిన ఉద్యోగులు మళ్ళీ డోలాయమాన పరిస్థితికి వచ్చారు. చాలామంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరులో స్థిరపడిపోయారు. తమ స్వంత ఊళ్ళకు దగ్గరగా ఉన్నామనే భావనతో వారు అమరావతిలో పనిచేస్తున్నారు.

ఇప్పుడు రాజధాని విశాఖపట్నం వైపు మారితే మళ్లీ ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ‘‘ఇక్కడ కొన్న ఇళ్ళను వదిలేసి మళ్లీ విశాఖ వెళ్లాలి. మళ్లీ అద్దె ఇల్లు తీసుకోవాలి. ఇంతకుముందు వారం వారం హైదరాబాద్‌కు వెళ్లి కుటుంబాన్ని చూసుకుంటున్న వారు ఎందరో ఉన్నా రు.  విశాఖ నుంచి హైదరాబాద్‌కు అలా వెళ్లి రావడం సులభం కాదు.

సీఎం ప్రకటన తమను ఆందోళనకు గురిచేస్తోంది' అని ఓ సచివాలయ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  అయితే ఉద్యోగుల ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మాట్లాడకపోవడంపై మండిపడుతున్నారు.

తక్షణ, ప్రత్యక్ష ప్రభావం పడే ఉద్యోగుల్లో దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల తీరు పూర్తిగా మారిపోయిందని, తమ సమస్యలను సూటిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే దమ్మున్న నేతలు లేరని ఉద్యోగులు వాపోతున్నారు.

రాజధాని నిర్ణయం ఒకసారే జరగాలి. రాజు మారినప్పుడల్లా తుగ్లక్ పాలనలా రాజధాని మారకూడదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరో ప్రభుత్వం అధికారంలోకొస్తే మళ్లీ రాజధాని మార్చేస్తారా? ఇలా మార్చుకుంటూ పోతే ఆంధ్రులకు శాశ్వత రాజధానే లేకుండా పోతుందంటున్నారు.

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle