newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

రాజధానిగా అమరావతికి స్థానం లేనట్లేనా?

24-10-201924-10-2019 15:53:44 IST
2019-10-24T10:23:44.544Z24-10-2019 2019-10-24T10:23:39.094Z - - 15-12-2019

రాజధానిగా అమరావతికి స్థానం లేనట్లేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిలో ఇప్పటిదాకా చేపట్టిన ప్రతి నిర్మాణం నిబంధనలకు విరుద్ధమే అని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీటర్‌ కమిటీ నిర్ధారించడంతో ఏపీ రాజధాని అమరావతినుంచి మారనుందన్న అభిప్రాయం బలపడుతోంది. ‘రాజధాని ఎక్కడ ఉండాలో’ సిఫారసు చేసేందుకు నియమించిన కమిటీ తొలి భేటీ జరగడం, ఆరువారాల్లో ఏపీ రాజధానికి అనువైన ప్రాంతంపై తన నివేదిక ఇస్తుందని, కమిటీ ఎక్కడ చెబితే అక్కడే రాజధాని ఉంటుందంటూ సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి  బొత్సా సత్యనారాయణ తేల్చి చెప్పడంతో అమరావతిపై ఇన్నాళ్లుగా ప్రజలు పెట్టుకున్న ఆశలు కల్లలవుతున్నాయని తెలియవస్తోంది.

రాష్ట్ర రాజధాని ఏపీ ప్రజలందరి రాజధానిగా, 13 జిల్లాల ప్రజల ఆశలు తీర్చేలా ఉండాలి. దేశంలోనే మేటి రాజధానిని నిర్మిస్తాం’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎక్కడ అనుకూలమని సిఫారసు చేస్తే అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రమంతా పర్యటించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి... పని ప్రారంభించిన ఆరు వారాల్లో నివేదికను అందిస్తారని ప్రకటించారు. 

రాజధాని ఎంపికతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను సమీక్షించి, తగు ప్రణాళికల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు (రిటైర్డ్‌ ఐఏఎస్‌) కమిటీ మొట్టమొదటిసారి బుధవారం భేటీ అయ్యింది. ఈ కమిటీ పని ప్రారంభించిన ఆరు వారాల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం... అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలను కమిటీ అందజేయనుంది.

రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. అమరావతిలో పునాదులు తీయాలంటే 100 అడుగులు తవ్వాలి. అవినీతి, దోపిడీకి తావులేకుండా మంచి రాజధాని నిర్మిస్తాం. రాష్ట్ర రాజధాని దేశంలో మేటి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 5 కోట్ల ప్రజలు హర్షించే రీతిలో రాజధాని కట్టి తీరుతాం అని బొత్స పేర్కొన్నారు. రాజధానిపై ప్రభుత్వం వేసిన కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల మనోభావాలను స్వీకరిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను కమిటీ పరిగణిస్తుంది. ఆరు వారాల్లో కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత సుదీర్ఘ చర్చ జరుగుతుంది. నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తాం అని మంత్రి స్పష్టం చేశారు.

రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పక్కనపెట్టారు. నారాయణ కమిటీ వేసి మరీ అమరావతిని ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా భవనం కట్టాలంటే పునాదికి ఐదు నుంచి పది అడుగుల లోతు తవ్వితే సరిపోతుంది. అమరావతిలో మాత్రం వంద అడుగులు తవ్వాలి అని మంత్రి సెలవిచ్చారు. భూములు ఇవ్వడానికి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే కారణం కాదని, తమ తర్వాతి తరాలకు లబ్ధి చేకూరుతుందనే వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పారు.

అమరావతిలో చంద్రబాబు చేపట్టినవన్నీ తాత్కాలిక నిర్మాణాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలు అధికారమిచ్చిన ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై తమ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉందని... కానీ ప్రతిపక్ష నేత, ఆయన తనయుడికే ఆ స్పష్టంత లేదని బొత్సా విమర్శించారు. 

చంద్రబాబు అమరావతిలో శాశ్వత భవనం ఒక్కటైనా ఎందుకు కట్టలేదు రాజధానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ అని చెప్పి కేవలం ఐదు వేల కోట్లే ఖర్చు పెట్టి మిగతా డబ్బును ఏం చేశారు’’ అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే... చంద్రబాబు ఐదేళ్లపాలన వల్ల ఏపీకి జరిగిన నష్టమే పూడ్చలేనిదన్నారు.

మొత్తానికి రాష్ట్ర రాజధాని విషయంలో మొదటినుంచి గుంభనంగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనకొచ్చిన అయిదు నెలలకు రాజధాని మార్పు గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle