newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం

29-01-201929-01-2019 15:50:33 IST
Updated On 29-01-2019 16:17:38 ISTUpdated On 29-01-20192019-01-29T10:20:33.082Z29-01-2019 2019-01-29T10:20:31.189Z - 2019-01-29T10:47:38.872Z - 29-01-2019

రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విభజన పేరుతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోకూడదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లను తప్పుపట్టడం కాదని.. ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన కూడా ఇలా జరగలేదని, ఏ బిల్లూ ఈ విధంగా ఆమోదం పొందలేదన్నారు. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై జరిగిన అన్యాయంపై చర్చించేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ భేటికి రావాలని ఆయన అన్ని పార్టీలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ. కాంగ్రెస్‌, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీల నుంచి ప్రతినిధులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు హాజరయ్యారు. వైసీపీ, సీపీఎం పార్టీలు డుమ్మా కొట్టాయి.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయంపై అందరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇక ఎప్పటికీ న్యాయం జరగదని పేర్కొన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి రూ.లక్షా 16 వేల కోట్ల నిధులు న్యాయంగా రావాల్సి ఉందని.. వాటినే ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఎవరు ఏ లెక్క చెప్పినా రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగిందన్నది వాస్తవమన్నారు. పవన్ కల్యాణ్‌పై ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. పవన్ స్వయంగా ఈ సమావేశానికి హాజరవ్వడంతో ఆయన గ్లామర్ పెరిగిందని ఉండవల్లి చమత్కరించారు.

పార్టీలు వేరైనా సమయం వచ్చినప్పుడు ఆంధ్రులంతా ఒక్కటేనన్న భావన ఉత్తరాది వారికి కలిగించాలని ఉండవల్లి సూచించారు.  రాజకీయాల పరంగా మీలో మీరు కొట్టుకు చచ్చినా రాష్ట్రం కోసం కలిసి పోరాడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు ఉండవల్లి. విభజన చట్టం అమలు విషయంలో,  ఆర్ధికపరమైన అంశాల్లో టీడీపీ, బీజేపీలకు స్వల్ప విభేదాలున్నాయన్నారు ఉండవల్లి. మొత్తం మీద అన్నిపార్టీలు కలిసి పోరాటం చేయడానికి ఈ సమావేశం నాంది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle