newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-2

03-05-201903-05-2019 07:22:53 IST
Updated On 03-05-2019 07:27:11 ISTUpdated On 03-05-20192019-05-03T01:52:53.266Z03-05-2019 2019-05-03T01:52:33.158Z - 2019-05-03T01:57:11.021Z - 03-05-2019

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

ఈ లెక్కన మనం మాట్లాడుకుంటే మొత్తం ఎన్నికల ఖర్చు రూ. 6000 కోట్లు దాటిపోయింది. అంతేకాదు ప్రెస్టేజ్ కారణంగా మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 75 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఇవి చాలవన్నట్టు ఎంపీ స్థానాల కోసం 25 ఎంపీ సీట్లలో ప్రతి ఎంపీ అభ్యర్ధి 100 కోట్ల వరకూ ఖర్చుపెట్టారు. దీంతో రెండు పార్టీలు కలిపి రూ.5000 కోట్లు ఎంపీల కోసం ఖర్చు చేశాయి.

దీంతో మొత్తం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు ఖర్చుపెట్టింది అక్షరాలా రూ.10 వేల కోట్లు దాటిపోయింది. 

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ లెక్కన చెప్పారో కానీ, ఆయన చెప్పింది మాత్రం వాస్తవమే అనిపిస్తోంది. ఇంత ఖర్చుపెట్టిన నేతలు ప్రజాసేవ ఎలా చేస్తారు? రాజకీయం వ్యాపారంగా మారిపోయాక.. ప్రజల కోసం చేసే కాంట్రాక్టుల్లో వచ్చే మొత్తం తమ ఎన్నికల ఖర్చుకి జమగా వేసుకోకుండా ఉంటారా?

ఐదేళ్ళలో తాము పెట్టిన పెట్టుబడికి రెండింతలు సంపాదించకుండా ఉంటారా? ప్రజల నుంచి సేకరించిన పన్నుల మొత్తాన్ని నేతలు కాంట్రాక్టులుగా మార్చి తమ జేబులో వేసుకుంటారు. తమ ఖర్చుని వడ్డీతో సహా.. కాదు చక్రవడ్డీతో సహా లాగేసుకుంటారు. అది కూడా చట్టబద్ధంగా.  ప్రశ్నించేవారెవరు? 

వ్యాపారంలో తాము పెట్టిన పెట్టుబడికి లాభం తీసుకోవడం సబబే కదా. ఓటుకి రూ. 1000 నుంచి 2వేలు తీసుకున్న ఓటర్లు.. తమ నేతలను ఏమని ప్రశ్నిస్తారు? ఇదీ మన ప్రజాస్వామ్యం. పార్టీలకు ఇన్నేసి వేలకోట్లు ఎలా వస్తున్నాయి? ఇదంతా ఎవరి సొమ్ము?

మనదగ్గర్నించి వసూలు చేసి, మనకే మళ్ళీ పంచిపెట్టి.. లాభం మాత్రం వారు కొట్టేస్తున్నారు. అక్షరక్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చులోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. మన అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చుపెట్టే రాష్ట్రం ఏదైనా ఉందా? ఉంటే ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి.

ఇంకా పూర్తికాలేదు ఈ కథనం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కీలక నియోజకవర్గాల్లో బెట్టింగులు కూడా వేలకోట్లు ఉంటాయని అంటున్నారు. అంటే ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు. తమ అభిమాన పార్టీల కోసం తమ ఆస్తిపాస్తుల్ని కోల్పోతున్నవారు ఉన్నారు. రాత్రికి రాత్రి బెట్టింగులతో కుబేరులు అవుతున్నవారు ఉన్నారు. అందుకే ప్రజాస్వామ్యవాదులు మన ఎన్నికలు ఎంత ఖరీదైనవో అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటున్నారు మరికొందరు సామాజికవేత్తలు. 

ఎన్నికలంటే ఇంత ఖర్చా? అమ్మో ..? మనం ఎటు పోతున్నాం? తలచుకుంటేనే గుండె సముద్రమయిపోతోంది కదా? సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనబడే మన రాష్ట్రానికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా పేద్ద సముద్రతీరం ఇచ్చాడు. రాజకీయనేతలు పంచుకునేందుకు బోలెడు వనరులిచ్చాడు. తుపానులు వచ్చినప్పుడు వేలకోట్ల సహాయనిధులిచ్చాడు.

పెద్దాళ్ళెప్పుడో చెప్పారు... పోగొట్టిన చోట వెతుక్కోమని. మనరాజకీయనేతలు చేస్తున్నది అదే. ఆ సంగతిని జనం పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలయ్యాక నేతలు  జనాల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. రాజకీయాలంతే.. మనమింతే! 

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-1  కోసం ఇక్కడ క్లిక్ చేయండి  https://www.newssting.in/p/5ccb9d29c6df354872590a49


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle