newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-1

03-05-201903-05-2019 07:16:12 IST
Updated On 03-05-2019 07:28:01 ISTUpdated On 03-05-20192019-05-03T01:46:12.916Z03-05-2019 2019-05-03T01:45:13.039Z - 2019-05-03T01:58:01.447Z - 03-05-2019

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కీలక నేతల భవితవ్యం ఈ ఎన్నికల ద్వారా వ్యక్తం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మరో నేత జగన్ ఈసారి ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

అందుకే ఏడాది పాటు కాళ్ళకు బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు. జనం కష్టాలు తెలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం ఇద్దరు నేతలకు ఇప్పుడు అనివార్యం. చావో రేవో అంటే ఏంటో ఇద్దరు నేతలకు తెలిసొచ్చింది. 

అసెంబ్లీలోని 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చయ్యాయని చెబుతున్నారు. స్వయంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని నొక్కి వొక్కాణించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదనేది వాస్తవం. ఓట్ల కోసం నోట్లు ఏరులై పారాయి.

మద్యం కేసులకి కేసులు పంపిణీ జరిగిపోయింది. ఈ వేల కోట్లతో పాటు మద్యం కూడా నియోజకవర్గాల్లో భారీగా సరఫరా అయింది. ఏపీ ఎన్నికలను చూసి మిగతా రాష్ట్రాలు నివ్వెరపోయాయి. రాజకీయం అంటే ఇంత కాస్ట్ లీగా ఉంటాయా అని వారంతా నోరెళ్ళబెట్టారు. దక్షిణ భారతదేశంలోనే ఉన్నా కేరళలో కేవలం 10 లక్షల రూపాయలతో ఎంపీగా గెలిచిన వారున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో 10 వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయనేది మనం ఆలోచిస్తే అవాక్కవ్వక తప్పదు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు అభ్యర్ధులకు పార్టీ ఫండ్ కింద అభ్యర్ధికి ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిందని వార్తలు వచ్చాయి.

ఈ లెక్కన 1750+1750 కోట్లు లెక్కన మొత్తం 3500 కోట్ల రూపాయలు ఖర్చయిందన్నమాట. దీనికి తోడు కీలక నియోజకవర్గాల్లో 50 కోట్ల రూపాయలకు పైనే ఖర్చయింది. ఈ లెక్కన 50 నుంచి 60 సీట్లను కీలక స్థానాలుగా గుర్తిస్తే 60X50 =300 కోట్లు రెండుపార్టీలు కలిసి 600 కోట్లు ఖర్చుచేశాయని సమాచారం. 

అంటే మొత్తం 3500+600 కోట్లు=4100 కోట్లు. మరికొన్ని నియోజకవర్గాల్లో 75 నుంచి 100 కోట్లు కూడా ఖర్చు చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన 5000 కోట్లు దాటిపోయింది. ఇక జనసేన మిగతా పార్టీలు కూడా తామేం తక్కువ తినలేదు అన్నట్టుగా ఖర్చు చేశాయి. 140 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేన 140 కోట్ల వరకూ ఖర్చుచేసిందంటున్నారు.

మిగతా పార్టీలు కూడా 100 కోట్లు పైగానే ఖర్చు చేశాయి. ఇవి కాకుండా మద్యం కోసం వేయికోట్లు వరకూ ఖర్చుచేశాయట. ఇది ఏ జర్నలిస్టులో, మేధావులో చెబుతున్న కాకిలెక్కలు కానేకాదు. రాజకీయ పార్టీల నేతలు  కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్న కోట్ల కథ. (ఇంకా ఉంది)

రాజకీయమా? ఫక్తు వ్యాపారమా?-2  కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://www.newssting.in/p/5ccb9ee1c6df354872590a4c

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle