newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

రాక్షసులతో యుద్ధం చేస్తున్నా.. దీవించండి

24-02-202024-02-2020 14:48:54 IST
Updated On 24-02-2020 17:04:20 ISTUpdated On 24-02-20202020-02-24T09:18:54.605Z24-02-2020 2020-02-24T09:18:52.448Z - 2020-02-24T11:34:20.468Z - 24-02-2020

రాక్షసులతో యుద్ధం చేస్తున్నా.. దీవించండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జగన్ వసతి దీవెనలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి వచ్చి ఇన్నేళ్ళయినా తీరు మారలేదన్నారు. తాను ప్రజలకోసం వినూత్న పథకాలు చేపట్టి అమలుచేస్తుంటే.. కొంతమంది అదేపనిగా విమర్శలు చేస్తున్నారన్నారు. రాక్షసులతో యుద్దం చేస్తున్నానని, తనను దీవించాలన్నారు జగన్.

ప్రతి పేదవాడి ఇంటినుంచి చదువుకునే వారి సంఖ్య పెరగాలన్నారు. మన రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని దానిని తగ్గించాలన్నారు. మనం బ్రిక్స్ దేశాలతో పోల్చుకుంటాం.. ఇటువంటి దేశాలతో పోల్చుతున్నపుడు ఇంటర్ తరువాత విద్య చూస్తే బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటే మన దేశంలో 25శాతం ఉందని, ఇటువంటి స్థితినుంచి మన దేశం బయట పడాలన్నారు. అప్పుడే తరం మారుతుంది, తలరాతలు మారుతాయి.

మన రాష్ట్రంనుంచే ఈ మార్పులు ప్రారంభం కావాలి. అందుకే విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టామని, వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఉన్నత చదువులు సజావుగా సాగాలన్నారు. డిగ్రీ, సాంకేతిక విద్యార్థులకు ఈ కార్యక్రమం వర్తింప చేస్తున్నామన్నారు. విద్యార్థుల వసతికి ఈ పథకం ఆసరాగా వుంటుందన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు సీఎం జగన్. 

విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకి నేరుగా నగదు చేరుతుందని. తమ పిల్లలను సంతోషంగా బడికి పంపించేలా తల్లిదండ్రులకు చేయూతనిస్తాం అన్నారు. అమ్మ ఒడి ద్వారా విద్యావ్యవస్థలో మార్పులు రావడం ప్రారంభం అవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చబోతున్నామన్నారు. పాఠశాలల్లో భోజన పథకంలో మెనూ మార్చడం జరిగిందని, ఖర్చు ఎంతైనా ఫర్వాలేదన్నారు.

ఆంగ్ల మాధ్యమం ద్వారా మార్పులు వస్తాయన్నారు. సమస్యలు అధిగమించేందుకు బ్రిడ్జ్ కోర్సులు తెస్తున్నాం అన్నారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాయిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.ప్రజా బలంతో దేవుడి ఆశీస్సులతో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్న తనకు మీ అందరి ఆశీర్వాదాలే బలం అన్నారు జగన్. 

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   13 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   14 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   16 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   17 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   20 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle