newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?

09-12-201909-12-2019 13:18:17 IST
Updated On 11-12-2019 10:24:24 ISTUpdated On 11-12-20192019-12-09T07:48:17.389Z09-12-2019 2019-12-09T07:48:13.416Z - 2019-12-11T04:54:24.751Z - 11-12-2019

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తామేంటో.. తమ నైజమేంటో.. దేశం మొత్తం చూసింది.. తెలుగు ప్రజలు ఇంకా దగ్గరగా చూశారు. తాను అధికారంలోకి వస్తే పారదర్శకతకు పెద్ద పీట వేసి రాష్ట్రంలో అవినీతి అన్నది లేకుండా చేస్తా. ఇది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటే మంత్రుల నుండి అధికారుల వరకు అందరికీ బాధ్యత పెరిగి ప్రజల పక్షాన ఉంటారన్నది కూడా అయన చెప్పిన మాటే.

ఎన్నికలకు ముందు మాటైతే చెప్పారు కానీ ఎన్నికలై ఆయనే ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆ పారదర్శకత కాకి ఎత్తుకెళ్లింది. పారదర్శకత అన్నది కేవలం మాటలే కానీ చేతలకు కాదేమో అని ఆయన ప్రభుత్వం గత ఆరు నెలల కాలంలో విడుదల చేసిన రహస్య జీవోలే చెప్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు సరాసరిన నెలకు ఐదు రహస్య జీవోలు విడుదల అయ్యాయంటే నమ్మగలమా?!

నిజానికి ఏ ప్రభుత్వమైనా జీవోలోని అంశం తెలిస్తే ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయని అనుకుంటేనే ఆ జీవోలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాయి. ఆ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ రహస్య జీవోలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రహస్య జీవోలను విడుదల చేయకూడదని, ప్రతిజీవోను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆదేశించింది.

ఇక కోర్టులు కూడా అదే మాట చెప్పాయి. ఆ మధ్యనే తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో, పేరాల శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు.. జీవోల విషయంలో ప్రభుత్వాలు పారదర్శకత పాటించాలని.. ప్రజల సొమ్ము ప్రజలకు తెలియకుండా ఖర్చు చేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రహస్య జీవోలను కుప్పలుగా విడుదల చేస్తుంది.

జగన్ సర్కార్ ఈ ఆరునెలలుగా విడుదల చేసిన రహస్య జీవోలలో ఒక్క నెంబర్ మాత్రం ఉంటుంది. ఎందుకోసం విడుదల చేశామన్నది మాత్రం ఎక్కడా ఉండదు. ఈ తరహాలో ముప్పై జీవోలపైనే ఉన్నాయి. వీటిలో రెవెన్యూ, ఆర్ధిక పరమైన అంశాలకు చెందినవే ఎక్కువగా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, ఫైనాన్స్ అంశాలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

వీటిలో ప్రభుత్వం రంగుల పిచ్చితో రాష్ట్రంలో దుబారాగా ఖర్చు పెట్టిన నిధులకు చెందిన జీవోలు, ప్రజా ప్రయోజనాలకు పాతర వేసి తమ అనుచరులకు కట్టబెట్టిన జీవోలు, తమ పార్టీ ప్రయోజనం కోసం పాటుపడేలా ఉపయోగించిన జీవోలు కూడా వీటిలో ఉన్నాయని అనుమానిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత వస్తుందనే విషయంలో తప్ప జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం జగన్ సర్కారుకు ఏముంది? అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై పైనే జీవోలా!!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle