newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

రహదారి ప్రమాదాలకు ఏపీలో తక్షణ చికిత్స

21-10-201921-10-2019 17:30:21 IST
2019-10-21T12:00:21.644Z21-10-2019 2019-10-21T12:00:19.496Z - - 28-05-2020

రహదారి ప్రమాదాలకు ఏపీలో తక్షణ చికిత్స
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తరచూ అనేకమంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 4,500 కి.మీ. మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్‌ఈసీ ఏర్పాటుచేయాలని ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్‌లకు (హెచ్‌ఈసీ) శ్రీకారం చుడుతోంది.

రోడ్డు ప్రమాదానికి గురైన గంటలోపు (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రిలో చేరిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే వీలుంది.కానీ, ట్రామాకేర్‌ ఆస్పత్రులలో సదుపాయాలు లేకపోవడంతో జనరల్‌ ఆస్పత్రుల్లో బాధితులు బెడ్లు లేక క్యాజువాలిటీలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వైఎస్సార్‌ రహదారి చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది.

రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్‌లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్‌కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్‌లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో హెచ్‌ఈసీలో శిక్షణ పొందిన పారా మెడికల్‌ సిబ్బందిని నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు.

రాష్ట్రంలో చెన్నై–కోల్‌కత, విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. ఫలితంగా కాగా, క్షతగాత్రుల కోసం గతంలో రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ రాష్ట్రవ్యాప్తంగా 32 ట్రామాకేర్‌ ఆస్పత్రులు గుర్తించింది.

వీటిలో 19 ప్రభుత్వాస్పత్రులు కాగా, 13 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే, రవాణా శాఖ గుర్తించిన ప్రైవేటు ట్రామాకేర్‌ ఆస్పత్రుల నిర్వాహకులు క్షతగాత్రులను చేర్చుకునేందుకు ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు కూడా సకాలంలో చికిత్స అందక తీవ్రంగా నష్టపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటా జరుగుతున్న వందలాది రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వీలవుతుంది.

 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   an hour ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   3 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   11 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle