రవిప్రకాష్ వ్యవహారం : రంగంలోకి దిగనున్న సీబీఐ, ఈడీ అధికారులు..?
08-10-201908-10-2019 11:03:17 IST
2019-10-08T05:33:17.727Z08-10-2019 2019-10-08T05:33:15.199Z - - 08-12-2019

టీవీ-9 బహిష్కృత సీఈవో రవి ప్రకాష్ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని ఆ లేఖలో ఆయన కోరారు. రవిప్రకాష్ అక్రమంగా ఆస్తులు కూడగట్టారని లేఖలో పేర్కొన్న విజయసాయిరెడ్డి ఫెమా, మనీల్యాండరింగ్‌తో ఐటీ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. అలాగే భారీగా ఆదాయపు పన్ను ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులను కూడగట్టారని, ఇంటర్నేషనల్ లెవల్లో ఎక్ష్టాషన్కు పాల్పడ్డారన్నది విజయసాయిరెడ్డి ప్రధాన ఆరోపణ కాగా, రవిప్రకాష్ అనేక మందిని బెదిరింపులకు చేయడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్ ఖురేషీతో కూడా రవి ప్రకాష్‌కు సంబంధాలు ఉన్నట్టు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సీబీఐ ప్రతిష్టను మరింత దిగజార్చిన సానా సతీష్‌తో చేతులు కలిపి చాలా మందిని రవిప్రకాష్ మోసం చేశాడని విజయసాయిరెడ్డి తన లేఖలో చెప్పుకొచ్చారు. ఇలా రవి ప్రకాష్ దేశ సంపదను దోచుకునే రీతిలో అక్రమ ఆస్తులను కూడగట్టడం వంటి వ్యవహారాలకు పాల్పడ్డారని, ఆయన ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ విషయంలోనైనా సరే జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని అంశాలను సుమోటోగా స్వీకరించి పూర్తి విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి లేఖను సుప్రీం న్యాయమూర్తి ఏ విధంగా పరిగణిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, రవిప్రకాష్ టీవీ-9 వ్యవస్థాపకుడిగా ఉన్న నాటి నుంచి సంస్థ డైరెక్టర్లకు తెలీయకుండా నిధులు వాడుకోవడం, కొత్త మేనేజ్మెంట్ను బాధ్యతలు చేపట్టనీకుండా అడ్డుపడటం వంటి వ్యవహారాలతో రవి ప్రకాష్ ఇప్పటికే పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా, రవిప్రకాష్‌కు ఇంటర్నేషనల్ స్థాయిలో ముఖ్యంగా మొయిన్ ఖురేషీతోను, సీబీఐ ప్రతిష్టను దిగజారే విధంగా వ్యవహరించిన సానా సతీష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. ముగ్గురూ కలిసి హైదరాబాద్‌లో ఒక జ్యూవెలరీ షాపు ఓనర్ సుఖేష్‌గుప్తాను బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వీరిపై ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా రవి ప్రకాష్ భారతదేశంలోనే కాకుండా కెన్యా, ఉగాండ వంటి మరికొన్ని దేశాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, అక్కడ కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయని విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు జస్టిస్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. సాధారణ మనిషిగా ఉన్న రవిప్రకాష్‌కు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి..? అన్నదానిపై విచారణ చేపట్టాలన్నారు. ఉగాండలోని కంపాలలో ఒక సిటీ కేబుల్‌లో రవిప్రకాష్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి లేఖలో చెప్పుకొచ్చారు. అలాగే రవిప్రకాష్ సతీమణి దేవికకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని సుప్రీం కోర్టు జస్టిస్‌కు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది.

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
an hour ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
4 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
5 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
a day ago

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
a day ago

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్‌ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019

ఆ ఆరు జీవోలు నిలిపివేత.. జగన్ సంచలన నిర్ణయం
07-12-2019

ఒక్క ఎన్కౌంటర్... అనేక వాదనలు..!
07-12-2019
ఇంకా