newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

రమేష్‌ ఆస్పత్రిపై చర్యలకు ఒకే.. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

15-09-202015-09-2020 07:39:32 IST
2020-09-15T02:09:32.546Z15-09-2020 2020-09-15T02:09:29.095Z - - 30-09-2020

రమేష్‌ ఆస్పత్రిపై చర్యలకు ఒకే.. సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తీవ్ర నిర్లక్ష్యం వహించి పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించారు. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు సాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు. 

పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపొచ్చుని తెలిపింది. దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అయితే రమేష్‌ అరెస్ట్‌పై సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చిన ధర్మాసనం అభిప్రాయపడింది. 

కాగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గత గురువారం ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోషులను కోర్టు నిలబెట్టే విధంగా విచారణ జరుపనున్నారు.

కాగా స్వర్ణ ప్యాలస్ ఘటనలో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే డాక్టర్ రమేష్ పారిపోయారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఇంతలో ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.. దర్యాప్తు నిలిపివేయాల్సిందిగా కోరింది.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డాక్టర్ రమేష్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దర్యాప్తు జరపవచ్చని సుప్రీం సూచించింది.

 

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

   an hour ago


అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

   3 hours ago


బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

   6 hours ago


కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

   8 hours ago


ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   9 hours ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   11 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   11 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   11 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   11 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle