newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

రమణ దీక్షితులికి జగన్ అండ?

29-09-201929-09-2019 07:19:51 IST
2019-09-29T01:49:51.657Z29-09-2019 2019-09-29T01:49:47.865Z - - 27-05-2020

రమణ దీక్షితులికి జగన్ అండ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడి డాక్టర్ రమణ దీక్షితులికి ఏపీ ముఖ్యమంత్రి అండగా నిలిచినట్లు తెలియవస్తున్నది. రమణ దీక్షితులు కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనుందని టిటిడీ వర్గాలు చెబుతున్నాయి.  టిటిడీ రమణ దీక్షితులుపై సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవాలనని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందుకు సీఎం జగన్ మౌఖిక ఆదేశాలే కరణమని కూడా చెబుతున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం హోదాలో జగన్ ఈ నెల 20న తిరుమల రానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం జగన్ రమణ దీక్షితులు విషయంలో ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు ఉణ్నాయి.

తెలుగుదేశం హయాంలో రమణ దీక్షితులు వ్యవహారం వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను బలవంతంగా పదవీ విరమణ చేయించారు. స్వామి వారి ఆభరణాల విషయంలో ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనల నేపథ్యంలో టీటీడీ ఆయనపై సుప్రీంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాగా తన పదవీ విరమణ విషయంలో రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.మిరాశీ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు రమణదీక్షితులుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ టీటీడీ అప్పట్లో సుప్రీంను ఆశ్రయించింది.  దానిని వెనక్కు తీసుకోవడానికి సూత్ర ప్రాయంగా నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారరు. అలాగే రమణ దీక్షితులును తిరిగి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించే విషయాన్ని కూడా తోసిపుచ్చలేమని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

రమణ దీక్షితులు వ్యవహారంలో జగన్ సర్కార్ సానుకూలంగా నిర్ణయం తసుకుంటుందని జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా రమణ దీక్షితులు కోర్టుకు వెళ్లడమే ఇందుకు కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్న  సమయంలో రమణ దీక్షితులు   ఆయనకు సన్నిహితంగా ఉండేవారు.

కాగా టిటిడీ కొత్త పాలక మండలి చైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి సారి సమావేశమైన సందర్భంలోనే రమణ దీక్షితులు అంశంపై చర్చించింది. అయితే కేసు కోర్టులో ఉన్న కారణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడింది. కాగా విషయం సీఎం దృష్టికి సుబ్బారెడ్డి తీసుకు వెళ్లారు. దీనిపై జగన్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని సూచించడంతో టిటిడీ పాలక మండలి అందుకు అంగీకారం తెలిపింది.

రమణ దీక్షితులుకు న్యాయం చేయాలని జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో శ్రీవారికి సంబంధించిన కొన్ని ఆభరణాలు మాయం అయ్యాయంటూ రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే రమణ దీక్షితులును బలవంతంగా పదవీవిరమణ చేయించారని జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నిటినీ తిరగదోడుతున్న జగన్...రమణ దీక్షితులు విషయంలోనూ అదే చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు.

దేశం హయాంలో బలవంతపు పదవీ విరమణ చేయాల్సి వచ్చిన రమణ దీక్షితులుకు హైకోర్టులో సానుకూల తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి టిటిడీ బోర్డు సుప్రీంలో దాఖలు చేసుకున్న అప్పీల్ ను ఉపసంహరించుకుంటే రమణ దీక్షితులును తిరిగి ఆలయ ప్రధాన అర్చకుడిగా విధుల్లోకి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. జగన్ ఆ దిశగానే యోచన చేస్తున్నట్లు సమాచారం. జగన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల విచ్చేయనున్నారు. ఆ సందర్భంగా రమణ దీక్షితులుకు సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle