newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

రచ్చ రేపుతున్న అంతర్వేది రథం ఘటన.. కొత్త ట్విస్ట్ లు

10-09-202010-09-2020 07:46:38 IST
Updated On 10-09-2020 07:57:25 ISTUpdated On 10-09-20202020-09-10T02:16:38.479Z10-09-2020 2020-09-10T02:16:33.059Z - 2020-09-10T02:27:25.001Z - 10-09-2020

రచ్చ రేపుతున్న అంతర్వేది రథం ఘటన.. కొత్త ట్విస్ట్ లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం మంటల బారిన పడిన ఘటన సరికొత్త మలుపు తిరిగింది. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఈ వ్యతిరేకతను చల్లార్చడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఫలించినట్లు కనిపించట్లేదు. 

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథం మంటలకు ఆహుతి కావడం వివాదం రాజేస్తోంది. రథం పైన ఏదో తేనె పట్టు ఉందని, ఆ తేనె పట్టుని తీయడం కోసం తగులపెట్టేశారంటున్నారు. ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇలా సంబంధం లేకుండా విభిన్నమయిన కథనాలు వినిపిస్తున్నాయి. అర్థరాత్రి ఒంటి గంటకు తేనెపట్టు తీయడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా తేనె పట్టుకోసం నిప్పు పెడతారా. ఆలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

ఆలయంలో సీసీ కెమెరాలు నెల రోజులుగా పనిచేయకపోవడానికి బాధ్యులెవరు. 62 ఏళ్ల నుంచి లేని ఇన్సూరెన్స్ ఇప్పుడే ఎందుకు చేయించారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు బీజేపీ. జనసేన పార్టీలు ఛలో అంతర్వేదికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట... ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలుకావన్నారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు... రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారన్నారు పవన్.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు ఆలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హైందవ శక్తి, భజరంగదల్, హిందూ చైతన్య వేదిక, ధర్మ వీర్ ఆధ్యాత్మిక వేదిక తదితర సంఘాల కార్యకర్తలు ఉన్నారు.

అగ్నికి ఆహుతైన స్వామి వారి రథాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరో మంత్రి చెల్లుబోయిన వేణుతో కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఆలయం లోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆలయం హైటెన్షన్ నెలకొంది. 

ఈ ఘటన రాష్ట్ర ప్రజల హృదయాలను కలిచి వేసిందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. మహిళలు, యువకులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. 

ఈ వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది రథం దగ్ధానికి కారకులైనవారు చంద్రబాబు అయినా, పవన్ అయినా మరెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. అంతర్వేది ఘటనపై సీఎం జగన్‌ విచారణకు ఆదేశించారని తెలిపారు. ఈ సంఘటనలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలను మానుకోవాలని సూచించారు. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. కావాలనే ఎవరూ రథాన్ని తగులబెట్టరని మంత్రి వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.

ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. అంతర్వేది దేవాస్థానం కార్యనిర్వహణాధికారినీ విధుల నుంచి తప్పించింది. ప్రాధాన్యత లేని విభాగానికి పంపించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు.

దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌కు అప్పగించారు. అంతర్వేది ఆలయ కార్యనిర్వహణాధికారి చక్రధరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఇన్‌ఛార్జిగా నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సమగ్ర విచారణ ఏదీ? 

ఇటు అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగనాథన్. రథాలు వుంచే చోటు భద్రతా పరంగా సక్రమంగా వుండాలన్నారు. అవసరం అనుకుంటే తిరుమలలో రథశాలను పరిశీలించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూాడాలన్నారు రంగనాథన్.

ఢిల్లీలో ఎంపీ రఘురామరాజు దీక్ష

ఇదిలా వుంటే ఈనెల 11వ తేదీన దేవాలయాల పరిరక్షణ కు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దేవాలయాల పై వరుసగా జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీ లోని తన నివాసంలో గాంధేయ పద్ధతిలో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కుల, మతాలకు అతీతంగా ఈ పవిత్ర దీక్షకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు

 

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   an hour ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   an hour ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   2 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   3 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   3 hours ago


హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

   3 hours ago


ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

   4 hours ago


పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

   6 hours ago


కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

   6 hours ago


తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle