newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

రఘువీరా.. పార్టీ మార్పుకు డేట్ ఫిక్స‌యిందా..?

14-11-201914-11-2019 08:24:49 IST
2019-11-14T02:54:49.814Z14-11-2019 2019-11-14T02:49:47.190Z - - 04-08-2020

రఘువీరా.. పార్టీ మార్పుకు డేట్ ఫిక్స‌యిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీలో కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని గుర్తించిన ఆ పార్టీ నేత‌లంతా వేర్వేరు పార్టీల్లోకి జంప్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ, అప్ప‌టి నుంచి పీసీసీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరారెడ్డి మాత్రం పార్టీ మార్పు గురించి అస్స‌లు ఆలోచించ‌నే లేదు. పార్టీ ఎట్టాగైనా బ‌తుకుతుంద‌న్న ఆశ‌తోనో లేక మంచి ప‌ద‌వి ఉంది క‌దా..?  చాల్లే అనుకున్నారేమో కానీ కాంగ్రెస్‌లో అట్టాగే  కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

మ‌ధ్య మ‌ధ్య‌లో ర‌ఘువీరారెడ్డి పార్టీ మారుతున్నార‌న్న వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టినా అది జ‌ర‌గ‌లేదు. ఇలాంటివ‌న్నీ కామనే అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా, ఒకే దిక్కులా మిగిలిపోయారు. రాష్ట్రంలో ఎలాగో పార్టీ ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌నిపించ‌డం లేదు.

క‌నీసం కేంద్రంలో పార్టీ అధికారంలోకి వ‌స్తే రాజ్య‌స‌భ సీటో.. లేక కేంద్ర‌మంత్రి ప‌ద‌వి అంటూ క‌ల‌లు క‌న్న ర‌ఘువీరారెడ్డికి అక్క‌డ కూడా పార్టీ పరిస్థితులు అలాగే ఉండటంతో ఏం చేయాలో తెలీయ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

న‌మ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోగా ఉన్న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి తప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రాజీనామా చేశానంటూ బాధ‌ప‌డుతున్నార‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. ఇప్పుడు పార్టీ ప‌ద‌వి కూడా లేక‌పోవ‌డంతో ఏం చేయాల‌బ్బా అనుకుంటున్నార‌ని ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గ‌మే చెప్పుకొస్తుంది.

ఈ స‌మ‌యంలో సైలెంట్‌గా ఉండిపోవ‌డ‌మే బెట‌ర్ అన్న ఫీలింగ్‌లో ర‌ఘువీరా ఉన్నారంటున్నారు. అప్పుడ‌ప్పుడూ మీడియా కంట‌కు క‌న‌ప‌డుతున్నా.. ప్ర‌శ్నిస్తే మాత్రం మీడియాతో మాట్లాడేందుకు ఆరు నెల‌ల‌పాటు విరామం ప్ర‌క‌టించానంటూ ర‌ఘువీరారెడ్డి చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన జేసీ దివాక‌ర్‌రెడ్డికే చెక్‌పెట్టిన ర‌ఘువీరా అంతా తానేన‌ని, తాను ఏ మాట చెబితే అదే అధిష్టానం మాట అన్న‌ట్టు చెప్పుకునే ఆయ‌న భ‌విష్య‌త్తు ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారిందని అటు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం పేర్కొంటున్నారు.

ఏదైనా పార్టీలో చేరాల‌న్నా చేర‌లేని ప‌రిస్థితి ర‌ఘువీరారెడ్డిది. మ‌రి ఆయ‌న కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతారా..? మ‌రేదైనా పార్టీలోకి వెళ‌తారా..? అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌. అస‌లు అవ‌న్నీ కాదు.. కొన్నాళ్లు అస్త్రాల‌న్నీ ప‌క్క‌న‌ప‌డేసి సైలెంట్‌గా ఉండిపోవ‌డ‌మే బెట‌ర్ అనుకుంటున్నార‌న్న వాద‌న‌లను  కొంద‌రు వినిపిస్తున్నా.. పార్టీ మార్పుకు సంబంధించిన మంచి ముహూర్తాన్ని ర‌ఘువీరారెడ్డి అతి త్వ‌ర‌లో వినిపిస్తార‌ని మ‌రికొంద‌రు చెప్పుకొస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle