newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

రఘురామ కృష్ణంరాజును అలా దెబ్బ కొట్టిన వైసీపీ

15-09-202015-09-2020 11:53:40 IST
Updated On 15-09-2020 14:06:07 ISTUpdated On 15-09-20202020-09-15T06:23:40.099Z15-09-2020 2020-09-15T06:23:36.641Z - 2020-09-15T08:36:07.727Z - 15-09-2020

రఘురామ కృష్ణంరాజును అలా దెబ్బ కొట్టిన వైసీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఏపీ భవన్‌లో సోమవారం నాడు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేత్వత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బెల్లాన చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రంగయ్య, సత్యవతి, భరత్‌, పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్‌వీవీ సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి తదితులు హాజరయ్యారు. వీరిలో రఘురామ కృష్ణంరాజు  మిస్ అయ్యారు. ఆయన్ను కావాలనే ఈ మీటింగ్ నుండి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.  

వైసీపీ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపీ భవన్ అధికారులు రఘురామ కృష్ణ రాజుకు సమాచారం అందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్న సమయంలో ఏపీ భవన్ అధికారులు రఘు రామ కృష్ణరాజుకు మరోసారి ఫోన్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకావద్దని కోరారు. రఘురామ కృష్ణంరాజు షాక్ కు గురయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు అర్థమవుతోందని అన్నారు.

పార్టీకి మాత్రం రాజీనామా చేయనని ఇటీవలే తేల్చి చెప్పారు రఘురామ కృష్ణంరాజు. ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే బటన్ నొక్కారు. అది ప్రజలకు తెలుసు. నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు తెలుసు అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను పార్టీకి విధేయుణ్ణి అని మరో మారు అన్నారు.

గత కొద్దిరోజులుగా వైసీపీ మీద, ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మీద రఘు రామ కృష్ణ రాజు వ్యంగ్యాస్త్రాలు, విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మీద చాలా విషయాల్లో ఆయన విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. రఘురామ కృష్ణ రాజును దాదాపుగా పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టేశారు. తాను మాత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి విధేయుడినే అని అంటూ ఉంటారు రఘురామ కృష్ణ రాజు. తాజా పరిణామాలతో ఆయన ఇంకెన్ని ప్రెస్ మీట్లు పెడతారో.. ఏయే నాయకులకు సవాళ్లు విసురుతారో చూడాలి. 

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

   an hour ago


అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

   3 hours ago


బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

   6 hours ago


కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

   8 hours ago


ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   9 hours ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   11 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   11 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   11 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   11 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle