newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

రగులుతున్న సీమ.. ఇవాళ విద్యాసంస్థల బంద్

07-11-201907-11-2019 12:47:55 IST
Updated On 07-11-2019 15:38:21 ISTUpdated On 07-11-20192019-11-07T07:17:55.607Z07-11-2019 2019-11-07T07:17:51.444Z - 2019-11-07T10:08:21.224Z - 07-11-2019

రగులుతున్న సీమ.. ఇవాళ విద్యాసంస్థల బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందనే వాదన ఎప్పటినుంచో ఉంది. తాజాగా రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. ఏపీ రాజధానిగా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు అమరావతిని ఎంపికచేశారు.

అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అసెంబ్లీ, సచివాలయంతో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాలు కూడా అమరావతిలోనే కొలువై వున్నాయి. దీంతో రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు.

తాజాగా రాజధాని మార్పు గురించి రోజుకో ప్రకటన వెలువడుతున్న వేళ రాయలసీమ నేతలు, విద్యార్ధి సంఘాలు, అడ్వకేట్లు, సామాజిక వేత్తలు రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైకోర్టుని కూడా అక్కడే నెలకొల్పాలని అడ్వకేట్లు ఆందోళన చేస్తున్నారు. గురువారం రాయలసీమ జిల్లా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమను పట్టించుకోకుంటే పాలకులకు పతనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 

విద్యాసంస్థల బంద్ కు సంఘీభావం తెలిపాయి ప్రైవేట్ విద్యాసంస్థలు. దీంతో స్కూళ్ళు, కాలేజీలు మూతబడ్డాయి. బంద్ లో పాల్గొన్న ఉద్యమ, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాల నేతలు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

వెనుకబడిన సీమ ప్రాంతంలో రాజధానైనా, హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కడప నగరంలోని కోటిరెడ్డి కూడలిలో బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆందోళనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle