newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

రక్షణ కోసం లోక్ సభ స్పీకర్, రక్షణమంత్రికి ఎంపీ వేడుకోలు

28-06-202028-06-2020 09:19:13 IST
2020-06-28T03:49:13.475Z28-06-2020 2020-06-28T03:49:06.017Z - - 05-07-2020

రక్షణ కోసం లోక్ సభ స్పీకర్, రక్షణమంత్రికి ఎంపీ వేడుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీలో రెబల్ గా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో సందడి చేస్తున్నారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం. రఘురామకృష్ణ రాజు భద్రతకు సంబంధించి తన ఓఎస్డీ ద్వారా హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు  చెప్పిన స్పీకర్. ఎలాంటి ఇబ్బందులు పడవద్దన్నారు. 

పార్లమెంటరీ కమిటీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. శనివారం ఉదయం10 గం.లకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయిన రఘురామ కృష్ణంరాజు పలు అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణమంత్రి బిజీగా వున్నా ఎంపీకి అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలనూ కలవనున్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఈసందర్భంగా ఎంపీ వారికి వివరించారు. 

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశానన్నారు ఎంపీ. అలాగే ఎలక్షన్ కమిషన్ ని కలిసి పార్టీలకు నియమనిబంధనలను అడిగి తెలుసుకున్నానని, షోకాజ్ నోటీసుకి ఎలాంటి సమాధానం పంపాలనే దానిపై న్యాయనిపుణులను సంప్రదించనున్నారు. ముఖ్యమంత్రి కి ఏవిధంగా సమాధానం ఇవ్వాలనే దానిపై న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. 

తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీని, ముఖ్యమంత్రి ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, వ్యతిరేకించబోననన్నారు. ప్రభుత్వానికి ఒకటిరెండు అంశాల్లో సూచనలు మాత్రమే చేసాను.80 శాతం ఉన్న భక్తుల మనోభావాలను వ్యతిరేకంగా  తిరుపతి భూముల అమ్మకానికి వెళ్లడం సరికాదని సూచించను. ప్రభుత్వానికి నేను చేసింది సూచనలే, విమర్శలు కాదన్నారు. నాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తూ అవాస్తవాలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ఱంరాజు. 

ముఖ్యమంత్రి జగన్ ని కలిసే అవకాశం వస్తుందని అనుకోవట్లేదని ముఖ్యమంత్రి చాలా బిజీగా గడుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను.. ఇస్తే కలిసి అన్ని వివరిస్తాను... లేకపోతే సవివరంగా మెయిల్ పంపుతానన్నారు. సోమవారం కలిసేందుకు  అవకాశం ఇస్తే ఖచ్చితంగా కలిసి నా వాదన తెలియచేస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడికి నాకు మధ్య అగాథం సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా జరిగిన చర్చలో పాల్గొన్నందుకు నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. నాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి. వాటికి చట్టబద్ధత లేదని రఘురామకృష్ణంరాజు పునరుద్ఘాటించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle