newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

యూనివర్సిటీలలో మొదలైన విగ్రహాల రాజకీయం

28-11-201928-11-2019 15:23:19 IST
Updated On 28-11-2019 15:42:32 ISTUpdated On 28-11-20192019-11-28T09:53:19.486Z28-11-2019 2019-11-28T09:53:16.782Z - 2019-11-28T10:12:32.117Z - 28-11-2019

యూనివర్సిటీలలో మొదలైన విగ్రహాల రాజకీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవి విద్యాబుద్ధులు నేర్పాల్సిన కేంద్రాలు.. యూనివర్సిటీలంటే ఉడుకు రక్తం పుష్కలంగా ఉండే యువత విద్యను అభ్యసించే ఆలయాలు. ఓ యువకుడు, లేదా యువతి ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నా.. పెడదోవ వైపు మళ్ళి జీవితాలను సర్వనాశనం చేసుకోవాలన్నా అక్కడే పునాది పడుతుంది. అందుకే అక్కడ జీవితంలో సమాజం కోసం ఏదోకటి సాధించిన మహనీయుల విగ్రహాలను పెడతారు.

వివిధ విభాగాలలో విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తులు.. సమాజం మీద బలమైన ముద్రవేసిన మహానుభావులు.. ఏవో పరిశోధనలు చేసి ముందు తరాలకు సంపదను అందించిన శాస్త్రవేత్తలు.. చదువుల సర్వసతి ఒడిలో ఉన్నత శిఖరాలను చూసిన విద్యావేత్తల విగ్రహాలను యూనివర్సిటీలలో నెలకొల్పుతారు. వారి విగ్రహాలను చూసి విద్యార్థులు స్ఫూర్తిపొందుతారని ఆ విగ్రహాల ఉద్దేశ్యం.

అయితే ఆ విద్యాలయాలు అప్పుడప్పుడు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయి. మన దేశంలో ఎప్పటి నుండో రాజకీయాలు కూడా ఆ యూనివర్సిటీల నుండే మొదలవుతాయి. ఒకప్పుడు ఆ విద్యార్థులను కూడా మన నేతలు రాజకీయాల కోసం వాడేసుకున్నారన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి నుండి కాస్త బయటపడి అక్కడ విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇప్పుడు మళ్ళీ ఒకనాటి పరిస్థితులే అక్కడ కనిపించేలా మారిపోతుంది. పునాదులు కూడా విగ్రహాల రూపంలో మొదలుకానున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆ నాగార్జునుడి విగ్రహమే చిన్నదిగా ఒక మూలాన ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీ ప్రధాన భవనం ఎదుట.. నాగార్జునుడి విగ్రహానికి మూడింతల పెద్దదిగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహం కొలువుదీరనుంది.

నాగార్జున యూనివర్శిటీలో వైఎస్ విగ్రహ నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇచ్చారన్న కారణంగా వైఎస్ విగ్రహాన్ని పెడుతున్నామని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విగ్రహ ఏర్పాటుపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలకు దిగుతుండగా విద్యావేత్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఊరూ వాడా ఉన్న వైఎస్ విగ్రహాలు ఇప్పుడు విద్యాలయాలలో కూడా నెలకొల్పడంపై విశ్లేషకులలో ఎంతవరకు సమంజసం అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒక శాఖకు అనుమతించారన్న కారణమే ఈ విగ్రహ ఏర్పాటుకు కారణమైతే ఐదేళ్లలో అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పడు జగన్ అధికారంలో ఉంటే వైఎస్ విగ్రహం వచ్చింది మరి రేపు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మరో విగ్రహం పెట్టకుండా ఉంటారా?

ఇప్పటికే అధికారం మారిన ప్రతిసారి మారే రంగులు.. చిహ్నాలు..పేర్లు మాదిరే యూనివర్సిటీలలో కూడా రాజకీయాలను నేర్పించడం మొదలుకానుందా? అనే అభిప్రాయాలను బయటపెడుతున్నారు. స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాలతో స్ఫూర్తిపొందే విద్యార్థులు రాజకీయ నేతల విగ్రహాల వలన ఏ స్ఫూర్తి పొందాలని ఈ తరహా చర్యలకు దిగుతున్నారో ఆ పెద్దలకే తెలియాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle