newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

‘యుద్ధం’ వార్తలపై పవన్ ఫైర్

02-03-201902-03-2019 12:26:59 IST
Updated On 02-03-2019 12:29:47 ISTUpdated On 02-03-20192019-03-02T06:56:59.996Z02-03-2019 2019-03-02T06:56:57.351Z - 2019-03-02T06:59:47.309Z - 02-03-2019

‘యుద్ధం’ వార్తలపై పవన్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా వార్తల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ 2 పేరుతో నిర్వహించిన దాడుల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుద్ధం గురించి అప్పుడెప్పుడో చేశారని చెబుతున్న కామెంట్లు వైరల్ అయ్యాయి.

పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రికలో కూడా పవన్ కళ్యాణ్ యుద్ధం రాబోతోందని చెప్పిన వార్తలు ప్రముఖంగా పబ్లిష్ అయ్యాయి. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జరిగిన ప్రచారంపై పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. 

Image may contain: text

తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని భారతీయ మీడియాకు పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తానెవరితో చెప్పలేదన్నారు. రాజకీయ విశ్లేషకులు, కొన్ని న్యూస్ ఛానల్స్‌ చెప్పిన జోస్యాన్ని తాను ఉదహరించానన్నారు. నాకు తెలుసని చెప్పలేదన్నారు పవన్. తన వ్యాఖ్యల్లో బీజేపీ మాట ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

కొంతమంది పవన్ కళ్యాణ్, జనసేనను అప్రతిష్ట పాలు చేయడానికే ఈ పనిచేశారన్నారు. రెండు సందర్భాలలో మాట్లాడిన వీడియోను జనసేన పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నందున జనసేన వరుస ట్వీట్లు చేసింది. 

ఓ ట్వీట్‌లో 'చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు. పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి' అని పవన్ పేర్కొన్నట్లుగా ఉంది. రెండోదాంట్లో ...'ఈ రోజున సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతాంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు రెండు సంవత్సరాల క్రితం చెప్పారు ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు.' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఫిబ్రవరి 26, 2019న పవన్ కళ్యాణ్ అన్నట్లు జనసేన పేర్కొంది.

పీకే అంటే పాకిస్తాన్ 

మరోవైపు పవన్ కళ్యాణ్, టీడీపీలపై తనదైన వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ ప్రబల శక్తిగా ఎదుగుతోందని, కొందరు మోడీని టార్గెట్ చేసి లబ్ధి పొందాలని భావిస్తున్నారన్నారు.  ప్రపంచమంతా ప్రధాని మోడీ వైపే చూస్తోందన్నారు. తీవ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసిన ఘనత మోడీదే అన్నారు. దౌత్యపరంగా భారత్‌ ఎన్నో విజయాలు సాధించిందని, అభినందన్‌ను విడిచిపెట్టేలా మోడీ పాక్‌ మెడలు వంచారని ఆయన అన్నారు.

మమతాబెనర్జీ చేసిన అసమంజస వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించారని, భారత్‌లోనూ పాకిస్తాన్‌కు హీరోలు ఉన్నారని జీవీఎల్ మహాకూటమి నేతలను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు-పవన్‌ మధ్య ఒప్పందం కుదిరిందా అని ఆయన ప్రశ్నించారు. పీకే అంటే మనం పవన్‌కల్యాణ్‌ అనుకుంటున్నాం కానీ అంతర్జాతీయ స్థాయిలో పీకే అంటే పాకిస్తాన్‌ అన్నారు. బీజేపీని దెబ్బతీయాలని చంద్రబాబు-పవన్‌ కుట్ర పన్నారని వారి ఆటలు సాగవన్నారు జీవీఎల్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle