newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

మ‌ళ్లీ స్టాండ్ మార్చుకున్న బాబు..!

21-09-201921-09-2019 08:43:01 IST
2019-09-21T03:13:01.123Z21-09-2019 2019-09-21T03:12:59.194Z - - 21-01-2020

మ‌ళ్లీ స్టాండ్ మార్చుకున్న బాబు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోవడం విజేత ల‌క్షణం. కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి వివిధ అంశాల‌పై రెండు నాల్కెల ధోర‌ణి.

ప్ర‌త్యేక హోదా స‌హా ప‌లు అంశాల‌పై ఆయ‌న డ‌బుల్ స్టాండ్ తీసుకోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేదు. మొద‌ట రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసి ఆయ‌న త‌ర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీకించారు. మ‌ళ్లీ కేంద్రంతో విభేదాలు వ‌చ్చాక ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు.

కేంద్రంతో ఓ స‌మ‌యంలో యుద్ధానికి సిద్ధ‌మైన చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు తీవ్ర అభ‌ద్ర‌తా భావానికి లోన‌య్యారు. ఈ స‌మ‌యంలోనే రాష్ట్రంలో సీబీఐకు జ‌న‌ర‌ల్ ప‌ర్మీష‌న్‌ను ర‌ద్దు చేసి సీబీఐ రాకుండా చేశారు. సీబీఐపై న‌మ్మ‌కం లేద‌ని, సీబీఐను కేంద్రం త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకొని న‌డిపిస్తోంద‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌.

ఇక‌, అదే స‌మ‌యంలో అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌పై, గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌నే అర్థం వ‌చ్చేలా ఆయ‌న మాట్లాడారు. ప‌లు అంశాల‌పై గ‌వ‌ర్న‌ర్ జోక్యాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు త‌న ఓట‌మికి ఒకే అంశంపై డబుల్ స్టాండ్ తీసుకోవ‌డం కూడా కార‌ణ‌మే అని గుర్తించ‌లేక‌పోయారు.

అందుకే ఇప్పుడు సీబీఐ, గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై త‌న స్టాండ్ మార్చుకున్నారు. మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వైసీపీ వేదింపుల వ‌ల్లే కోడెల ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌నేది ఆయ‌న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సీబీఐ విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నిక‌ల ముందు సీబీఐపై న‌మ్మ‌కం లేద‌ని చెప్పిన ఆయ‌న ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌ను కోర‌డాన్ని వైసీపీ త‌ప్పుప‌డుతోంది. పైగా అప్పుడు కేంద్రంలో ఉన్న‌ది, ఇప్పుడు ఉన్న‌ది ఒకే ప్ర‌భుత్వం. ఇక‌, గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను అనేక‌సార్లు త‌ప్పుప‌ట్టి, గ‌వ‌ర్న‌ర్ అధికారాల‌ను, జోక్యాన్ని ప్ర‌శ్నించిన ఆయ‌న ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు.

కోడెల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం మీద ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాల్సిందిగా కోరారు. చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డంపై వైసీపీ గ‌తంలో చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ త‌ప్పుబ‌డుతోంది. ఏదేమైనా చంద్ర‌బాబు ఏ అంశంపైన అయినా త‌న స్టాండ్‌ను సులువుగా మ‌ర్చేసుకోగ‌ల‌ర‌ని మాత్రం ఈ రెండు సంఘ‌ట‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle