newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఘ‌ట్ట‌మ‌నేని చూపు..?

06-06-202006-06-2020 19:03:55 IST
2020-06-06T13:33:55.961Z06-06-2020 2020-06-06T13:33:28.925Z - - 30-11-2020

మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఘ‌ట్ట‌మ‌నేని చూపు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని ప్ర‌ముఖ కుటుంబాలు ఒక్కో రాజ‌కీయ పార్టీ లైన్‌లో ఉన్నాయి. కొన్ని కుటుంబాలు బాహాటంగానే ఒక పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తుంటే మ‌రికొన్ని కుటుంబాలు మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా వారికి న‌చ్చిన పార్టీకి అండ‌గా నిలుస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్ర‌ముఖ కుటుంబంగా ఉన్న ఘ‌ట్ట‌మనేని వారు ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిలుస్తున్నారు. ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా కృష్ణ‌ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. త‌ర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితోనూ కృష్ణ‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఎన్నికల్లో కృష్ణ - విజ‌య‌నిర్మ‌ల దంప‌తులు వైఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే వారు. విజ‌య నిర్మ‌ల అయితే రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అభిమాని అని చెప్పేవారు.

వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆయ‌న కుటుంబంపై కృష్ణ దంప‌తులు ఆప్యాయ‌త‌ను క‌న‌బ‌రిచారు. గ‌త ఎన్నిక‌ల ముందు, పాద‌యాత్ర స‌మ‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఇక‌, కృష్ణ సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. జ‌గన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఓ ప‌ది మంది నేత‌ల‌ను లెక్కేస్తే ఆదిశేష‌గిరిరావు కూడా ఒక‌రిగా ఉండేవారు. పార్టీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే కొంద‌రిలో ఆయ‌న ఒక‌రు. పార్టీకి కూడా ఆర్థికంగానూ చాలా అండ‌గా నిలిచార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

ఇంత‌లా ఆయ‌న వైసీపీలో కీ రోల్ పోషించేవారు. ఒక‌వైపు కృష్ణ దంప‌తులు వైఎస్ జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌టం, ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు ఏకంగా వైసీపీలో కీల‌క స్థానంలో ఉండ‌టంతో ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు కూడా వైసీపీ వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపేవారు. మ‌హేష్ బాబు రాజ‌కీయాల‌కు సంబంధం లేన‌ట్లుగానే ఉంటారు. ఆయ‌న అస్స‌లు ఈ వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌రు.

దీంతో కృష్ణ‌, ఆదిశేష‌గిరిరావు రూట్ ఎలా ఉంటే ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు కూడా ఆ రూట్‌లో వెళ‌తారు. అయితే, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అనూహ్యంగా ఆదిశేష‌గిరిరావు అనూహ్యంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల నుంచి వైసీపీలో చేరిక‌లు ఉంటే, ఆదిశేష‌గిరిరావు మాత్రం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు.

త‌న‌కు ఎంపీ సీటు విష‌యంలో వైసీపీ నుంచి ఎటువంటి హామీ ద‌క్క‌లేద‌ని అసంతృప్తితోనే ఆదిశేష‌గిరిరావు టీడీపీలో చేరార‌నే ప్ర‌చారం ఉంది. అయితే, టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న వేసింది రాంగ్ స్టెప్ అయింది. అయితే, వైసీపీ నేత‌ల‌తోనూ ఇంకా ఆయ‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌రోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఆయ‌న వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డిని క‌లిశారు. బ‌య‌ట‌కు సినిమా షుటింగ్‌ల‌కు అనుమ‌తులు ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డానికి క‌లిసిన‌ట్లుగా చెబుతున్నా ఆయ‌న వైసీపీలో చేరిక‌కు లైన్ క్లీయ‌ర్ చేసుకోవ‌డానికే వెళ్లార‌ని తెలుస్తోంది.

ఆదిశేష‌గిరిరావు వైసీపీలో చేరితే మ‌ళ్లీ ఆ పార్టీకి కూడా కొంత క‌లిసి వ‌చ్చే అవకాశం ఉంది. పైగా ఆయ‌న పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అండ‌గా ఉన్నార‌నే అభిప్రాయం జ‌గ‌న్‌కు ఉంది. దీంతో ఆదిశేష‌గిరిరావుకు పార్టీలోకి సాద‌ర స్వాగ‌త‌మే ల‌భించే అవ‌కాశం ఉంది. కాగా, కృష్ణ అల్లుడు, టీడీపీ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వైఖ‌రి ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న టీడీపీలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

వైసీపీ స‌ర్కార్‌పై కొంత‌కాలం క్రితం వ‌ర‌కు ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు చేసే వారు. ఇప్పుడు మాత్రం కొంత సైలెంట్ అయ్యారు. నిజానికి వారిది కూడా టీడీపీ కుటుంబం ఏమీ కాదు. ఆయ‌న త‌ల్లి గ‌ల్లా అరుణ చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 2014 ముందే వారి కుటుంబం టీడీపీలోకి వెళ్లింది. మ‌రి, ఆదిశేష‌గిరిరావు వైసీపీలో చేరితే గ‌ల్లా జ‌య‌దేవ్ ఎలాంటి వైఖ‌రి తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

   6 hours ago


అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

   8 hours ago


ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

   10 hours ago


కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   13 hours ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   13 hours ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   14 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   16 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   17 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   18 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   18 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle