newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

మ‌ళ్లీ తెర‌పైకి శివాజీ..! వ‌చ్చారా..? తెచ్చారా..?

05-01-202005-01-2020 09:46:45 IST
Updated On 08-01-2020 13:26:27 ISTUpdated On 08-01-20202020-01-05T04:16:45.739Z05-01-2020 2020-01-05T04:16:28.206Z - 2020-01-08T07:56:27.140Z - 08-01-2020

మ‌ళ్లీ తెర‌పైకి శివాజీ..! వ‌చ్చారా..? తెచ్చారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ న‌టుడు, ఆప‌రేష‌న్ గ‌రుడ ఫేమ్ శివాజీ మ‌ళ్లీ తెర మీద‌కు వ‌చ్చారు. గ‌త ఆరు నెల‌లుగా కేసుల్లో ఇరుక్కొని తెర‌మ‌రుగైన ఆయ‌న మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొన‌సాగాలంటూ తెలుగుదేశం పార్టీ అనుబంధ ఛాన‌ల్‌లో గ‌ళ‌మెత్తారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై, రాజ‌ధాని అమ‌రావ‌తిపై త‌న ఆవేద‌న‌ను, బాధ‌ను వెళ్ల‌గ‌క్కారు. ప‌నిలో ప‌నిగా హైద‌రాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లము కుక్క‌ల్లా బ‌తుకుతున్నామ‌ని, కుక్క‌ల కంటే హీనంగా బ‌తుకుతున్నామ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సినీ న‌టుడు శివాజీ రాజ‌కీయాల్లో ఎప్పుడూ వివాదాస్ప‌దంగా ఉంటూ వ‌స్తున్నారు. గ‌తంలో బీజేపీలో ప‌ని చేసిన ఆయ‌న ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీ అనుకూల‌వాదిగా మారిపోయారు.

ఆప‌రేష‌న్ గ‌రుడ అంటూ బీజేపీ అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వంపై కుట్ర చేస్తోందంటూ ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీపై, ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పూర్తిగా టీడీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. టీడీపీని గెలిపించాల‌ని కోరారు.

కానీ, ఆయ‌న విన‌తిని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. త‌ర్వాత శివాజీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఓ టీవీ ఛాన‌ల్‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో శివాజీ కేసుల్లో చిక్కుకున్నారు. కొన్ని రోజులు ప‌రారీలో ఉన్నారు. దేశం దాటేందుకు ప్ర‌య‌త్నించి పోలీసుల‌కు చిక్కారు. దీంతో ఆరు నెల‌లుగా ఆయ‌న మీడియాలో క‌నిపించ‌డం లేదు. మ‌ళ్లీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారంపై చ‌ర్చ న‌డుస్తుండ‌గా శివాజీని ఒక్క‌సారిగా టీడీపీ అనుకూల ఛాన‌ల్ తెర‌పైకి తీసుకొచ్చింది.

త‌న స‌హ‌జ శైలికి త‌గ్గ‌ట్లుగానే శివాజీ లైవ్‌లో ఆవేద‌న‌లు, ఆక్రోశాలు వెళ్ల‌గ‌క్కారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను, ప్ర‌జ‌ల భ‌విష్య‌త్‌ను త‌లుచుకొని బాధ‌ప‌డిపోయారు. మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌ను శివాజీ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. మూడు రాజ‌ధానుల వ‌ల్ల విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలుకు కూడా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని ఒక నిపుణుడిలా చెప్పారు. అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని ఆయ‌న గ‌ట్టిగా డిమాండ్ చేశారు.

అంతేకాదు, అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని కేవ‌లం రాజ‌ధాని ప్రాంత రైతులే ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని, రాష్ట్ర‌ప్ర‌జ‌లంతా ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అన్ని జిల్లాల ప్ర‌జ‌ల్లో భావోద్వేగం ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఒకానొక ద‌శ‌లో ప్ర‌జ‌ల‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదుపుత‌ప్పి స‌న్నాసుల్లారా అంటూ సంబోధించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పోల్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ రెచ్చ‌గొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు.

త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ప్ర‌శ్నించిన ఓ కాల‌ర్‌పై లైవ్‌లోనే బండ‌బూతులు క‌క్కారు. ఇంత జ‌రుగుతున్నా, శివాజీ అదుపు త‌ప్పి ప్ర‌జ‌ల‌ను, కాల‌ర్‌ను లైవ్‌లో బండ‌బూతులు తీడుతున్నా ఛాన‌ల్ వారు ఆయ‌న‌ను నిలువ‌రించ‌లేక‌పోయారు.

మొత్తానికి చాలా రోజుల‌కు శివాజీ తెర‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తికి అనుకూలంగా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌ను ఉద్య‌మబాట ప‌ట్టించేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నించారు. మ‌రి, ఆవేద‌న‌, ఆక్రోశాన్ని ప్ర‌జ‌లు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle