newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

మ‌రో సంక్షోభం ముంచుకొస్తుందా..?

26-10-201926-10-2019 08:08:24 IST
Updated On 26-10-2019 08:08:14 ISTUpdated On 26-10-20192019-10-26T02:38:24.604Z26-10-2019 2019-10-26T02:37:27.488Z - 2019-10-26T02:38:14.123Z - 26-10-2019

మ‌రో సంక్షోభం ముంచుకొస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ‌లు, సంక్షోభాలు కొత్తేమీ కాదు. దివంగ‌త ఎన్టీఆర్ హ‌యాం నుంచి ప్ర‌స్తుత చంద్ర‌బాబు నాయుడు కాలం వ‌ర‌కు ఆ పార్టీ ఎన్నో క్లిష్ఠ ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంది. పార్టీలో నెంబ‌ర్ 2గా ఎదిగిన నాయ‌కులే వెళ్లిపోయిన సంద‌ర్భాలు టీడీపీ చూసింది. అయితే, ఎన్ని సంక్షోభాలు వ‌చ్చినా త‌ట్టుకొని నిల‌బ‌డింది ఆ పార్టీ.

కానీ, ఇటీవ‌లి ఎన్నికల్లో పార్టీ చ‌రిత్ర‌లోనే లేనంత‌టి దారుణ ఓట‌మి ఎదురైన‌ త‌ర్వాత మాత్రం పార్టీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బలు త‌గులుతున్నాయి. ఓ వైపు పార్టీ క్యాడ‌ర్‌లో భ‌రోసా నింపేందుకు, పార్టీని ప్ర‌జ‌ల్లో ఉంచేందుకు ఈ వ‌య‌స్సులోనూ చంద్ర‌బాబు నాయుడు నిత్యం ఎదో ఓ కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లో, మీడియాలో ఉంటున్నారు. పార్టీకి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌పై, టీడీపీ భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం లేక‌నో, ఇత‌ర కార‌ణాలో కానీ వ‌రుస‌గా టీడీపీ నేత‌లు పార్టీని వీడుతున్నారు. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేర‌డం పెద్ద షాక్ అయితే త‌ర్వాత కూడా ప‌లువురు నేత‌లు బీజేపీ, వైసీపీలో చేరారు. అయితే, వీరంతా ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఓడిన వారే. కానీ, ఇప్పుడు మాత్రం టీడీపీలో పెద్ద సంక్షోభ‌మే ముంచుకొచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇందుకు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ రిబ్బ‌న్ క‌ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో అర‌గంట పాటూ భేటీ అయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇద్ద‌రూ ఆయ‌న‌ను ద‌గ్గ‌ర పెట్టుకొని వెళ్లి మ‌రీ ముఖ్య‌మంత్రిని క‌లిశారు. అస‌లు తీరిక లేకుండా గ‌డుపుతూ స్వంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేక‌పోతున్న జ‌గ‌న్.. వంశీకి అర‌గంట పాటు స‌మ‌యం ఇచ్చి మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వంశీ ముందు నుంచీ జ‌గ‌న్ ప‌ట్ల కొంత సాఫ్ట్‌కార్న‌ర్‌తో ఉంటున్నారు. 2014కు ముందు ఓసారి విజ‌య‌వాడ‌లో న‌డిరోడ్డుపై జ‌గ‌న్‌ను క‌లిసి ఆలింగ‌నం చేసుకున్నారు. అప్పుడు వంశీ వైసీపీలోకి జంప్ చేస్తార‌ని అంతా అనుకున్నా ఆయ‌న టీడీపీలోనే ఉండి రెండుసార్లు గ‌న్న‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఏనాడూ జ‌గ‌న్‌ను పెద్ద‌గా విమ‌ర్శించిన దాఖ‌లాలు లేవు.

ఈ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వంటి సీనియ‌ర్ల‌తో పాటు నిమ్మ‌ల రామానాయుడు వంటి జూనియ‌ర్ ఎమ్మెల్యేలు సైతం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నా వంశీ మాత్రం త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లు ఉంటున్నారు.

జ‌గ‌న్‌ను ఆయ‌న క‌ల‌వ‌డంతో ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం మొద‌లైంది. కాగా, అంత‌కుముందు ఆయ‌న సుజ‌నా చౌద‌రిని క‌ల‌వ‌డంతో బీజేపీలో చేర‌తార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ, ఆయ‌న వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నార‌ని, దీపావ‌ళి త‌ర్వాత ఈ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, నిన్న‌నే మ‌రో టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం సైతం సుజ‌నా చౌద‌రిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో చేరితే వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంది. టీడీపీ వారిపై ఫిర్యాదు చేసిన మ‌రుక్షణ‌మే వైసీపీ స్పీక‌ర్ ద్వారా అన‌ర్హ‌త వేటు వేయిస్తోంది. వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌నే ష‌ర‌తు ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొత్త బాట‌ను ఎంచుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌వుతార‌ని, వైసీపీలో నేరుగా చేర‌కుండా త‌మ‌ను ప్ర‌త్యేక బృందంగా గుర్తించ‌మ‌ని స్పీక‌ర్‌ను కోరుతార‌నే ప్ర‌చారం ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జ‌రుగా వినిపిస్తోంది. ఇలా చేస్తే వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉండ‌దు. టీడీపీ ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతు కావ‌చ్చు. ఇదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యేల‌ను నేరుగా చేర్చుకొని వైసీపీ కూడా బ‌ద‌నాం కాకుండా ఉంటుంది.

అయితే, వంశీ టీడీపీని విడ‌తారా ? వ‌ంశీ త‌ర్వాత ఎవ‌రెవ‌రు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌లువురు ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి పేరు కూడా ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

మ‌రో వైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని. ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి దీపావ‌ళి త‌ర్వాత టీడీపీలో సంక్షోభం ముంచుకొచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి, ఈ సంక్షోభాన్ని చంద్ర‌బాబు నాయుడు ఎలా నివారిస్తారో, ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle