newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

14-10-201914-10-2019 13:29:13 IST
Updated On 14-10-2019 15:15:43 ISTUpdated On 14-10-20192019-10-14T07:59:13.130Z14-10-2019 2019-10-14T07:54:25.651Z - 2019-10-14T09:45:43.366Z - 14-10-2019

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల నుంచి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలపై ఆమ‌లుపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. పాద‌యాత్ర స‌మ‌యంలో స‌మ‌స్య‌లు తెలుసుకున్న జ‌గ‌న్ వాటి నుంచే కొన్ని ప‌థ‌కాల‌ను రూపొందించి మేనిఫెస్టోలో పెట్టారు. మిగ‌తా పార్టీల‌కు భిన్నంగా మేనిఫెస్టో అమ‌లుకు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

మొద‌టి ఏడాదే సాధ్య‌మైనంత వ‌ర‌కు మేనిఫెస్టోలో చెప్పిన అంశాల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. అయితే, ఈ ప‌థ‌కాల అమ‌లులో లోపాలు ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శిస్తున్నా జ‌గ‌న్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా వ్య‌వ‌సాయ‌, విద్యా రంగానికి జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

విద్యా రంగానికి సంబంధించి ఇప్ప‌టికే అమ్మ ఒడి వంటి ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు జ‌గ‌న్‌. నిర‌క్ష‌రాస్య‌త శాతాన్ని ఐదేళ్ల‌లో సున్నా చేయాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్నారు. సాధ్యాసాధ్యాలు ప‌క్క‌న పెడితే ఆయ‌న ప్ర‌య‌త్నాలు మాత్రం ఆ దిశ‌గానే సాగుతున్నాయి. స్కూల్ డ్రాపౌట్స్ త‌గ్గించ‌డానికి అమ్మ ఒడి ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

కేవ‌లం పిల్ల‌ల‌ను బ‌డికి పంపిస్తే చాలు త‌ల్లికి ప్ర‌తీ సంవ‌త్స‌రం రూ. 15 వేలు ఇచ్చేలా ఆయ‌న ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు. ఈ ప‌థ‌కం ద్వారా ఈసారి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

తాజాగా ఆయ‌న వ‌చ్చే నెల 14 నుంచి ఆయ‌న విద్యారంగానికి సంబంధించి కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డం, శిథిలావ‌స్థ‌లో ఉండ‌టంతో పిల్ల‌ల‌ను  పంపించ‌డం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లను పూర్తిగా మార్చేలా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. పాఠ‌శాల‌ల‌ను ద‌శ‌ల‌వారీగా నాలుగేళ్ల‌లో బాగు చేసేలా ప‌థ‌కాన్ని రూపొందిస్తున్నారు.

ఇందుకోసం ఏడాది రూ.1,500 కోట్ల చొప్పు నాలుగేళ్ల‌లో రూ.6 వేల కోట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌తీ పాఠ‌శాల ఇప్పుడు ఎలా ఉందో, అభివృద్ధి చేసిన త‌ర్వాత ఎలా మారింది అనే ఫ‌లితం చూపించే విధంగా ఈ కార్య‌క్ర‌మం ఉండ‌బోతోంది. పైగా ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ల ద్వారా కాకుండా క‌మ్యూనిటీ కాంట్రాక్టింగ్ అనే ప‌ద్ధ‌తి ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే వారి గ్రామాల్లో పాఠ‌శాల‌ల‌ను బాగు చేయాల‌నుకుంటున్నారు.

ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌లోనూ బాగుంటే మాత్రం మంచి ఫ‌లితాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు బాగోలేవ‌నో, నాణ్య‌మైన విద్య అంద‌డం లేద‌నో పేద‌లు సైతం పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు పంపించి ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను మెరుగుప‌రిచి, నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే వారు మ‌ళ్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల‌ను చేర్చించ‌డానికి ముందుకు వ‌స్తారు. మ‌రి, ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ ఎలా ఉంటుందో చూడాలి.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle