newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్‌..!

27-10-201927-10-2019 15:50:23 IST
2019-10-27T10:20:23.405Z27-10-2019 2019-10-27T10:20:10.324Z - - 16-11-2019

మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్  దీపావ‌ళి కానుక అందించింది. ప్ర‌జా సంక్షేమానికి తొలి ప్రాధాన్య‌మిస్తున్న సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృతం చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ్యాధుల‌తోపాటు మ‌రికొన్ని వ్యాధుల‌ను ప‌థ‌కం ప‌రిధిలోకి రానున్నాయి.

ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృతం చేసే క్రమంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ‌చ్చే నెల 1 నుంచి సామాన్యుల‌కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.  ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని రాష్ట్రాల్లోని ముఖ్య ప‌ట్ట‌ణాల్లో ఉండే ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా వ‌ర్తింపచేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆరోగ్య శ్రీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. గుండె, లివ‌ర్‌, కిడ్నీ లాంటి తీవ్ర‌మైన జ‌బ్బుల‌కు ఏపీలో వైద్య సౌక‌ర్యం అంతంత మాత్రంగానే అందేది. హైద‌రాబాద్, చెన్నై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక స్థోమ‌త లేకపోవ‌డంతో పేద‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏపీలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు ఉన్న‌ప్ప‌టికీ ఆధునిక ప‌రిక‌రాలు సైతం అన్ని ఆసుప‌త్రుల్లో అందుబాటులో లేవు. దీంతో పక్క రాష్ట్రాల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. వెయ్యి రూపాయ‌లు దాటితే ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే క్ర‌మంలో అద‌న‌పు వ్యాధుల‌ను ప‌థ‌కంలో చేర్చారు.

అలాగే హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో అత్యాధునిక వైద్య స‌దుపాయాలు పొందేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న‌వంబ‌ర్ 1 నుంచి ఎం ప్యానెల్ చేసిన ఆసుప‌త్రుల్లో ఆరోగ్య శ్రీ సేవ‌లు అందుబాటులోకి రానుండ‌గా, అవ‌య‌వ మార్పిడి, న్యూరో స‌ర్జ‌న్, నెఫ్రాల‌జీ వంటి 17 అంశాల్లో 716 చికిత్స‌ల‌కు సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

మ‌రోవైపు ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాలు పెరిగాయి. జిల్లా ఆసుప‌త్రులు,  ఏరియా ఆసుప‌త్రులు, క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌ల‌లో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది వేత‌నం రూ.16వేల‌కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వేత‌న పెంపు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి వ‌ర్తించ‌నుంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle