newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన వైసీపీ వివాద‌స్ప‌ద ఎమ్మెల్యే..!

06-11-201906-11-2019 09:40:01 IST
Updated On 06-11-2019 15:38:31 ISTUpdated On 06-11-20192019-11-06T04:10:01.026Z06-11-2019 2019-11-06T04:09:59.240Z - 2019-11-06T10:08:31.396Z - 06-11-2019

మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన వైసీపీ వివాద‌స్ప‌ద ఎమ్మెల్యే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెల్లూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఇటీవ‌ల వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఆయ‌న‌ చేసిన వ్యాఖ్య‌లు అటు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌య్యాయి. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధర్‌రెడ్డి తాజాగా మీడియా స‌మావేశం పెట్టి జిల్లాలో మాఫియా ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వైపు జ‌గ‌న్ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్షాలు నిత్యం ఇసుక విధానంపై విరుచుకుప‌డుతుండ‌గా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు గొంతు క‌లిపేలా ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు అధికార పార్టీలో చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాల మాదిరిగానే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సైతం అదే ఇసుక అంశంపై.. ఇసుక మాఫియా అంటూ విరుచుకుప‌డ్డారు.

ఒకే ఒక్క నిమిషంలో ఇసుక నో స్టాక్ బోర్డులు.. ఏంటీ ఈ దారుణ‌మంటూ మండిప‌డ్డారు. స్థానికంగా అవ‌స‌రాల‌కు కాకుండా ప‌క్క రాష్ట్రాల‌కు య‌థేచ్ఛ‌గా ఇసుక మాఫియా త‌ర‌లిస్తుంద‌ని అన్నారు. ఓ ట్రాక్ట‌ర్ ఇసుక ధర రూ.2,600లుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తే ఆ ధ‌ర రూ.4 వేలు, రూ.5వేలు ఎలా అవుతుంది..? అంటూ  ప్ర‌శ్నించారు. అందుకు అధికారుల‌దే బాధ్య‌త‌న్నారు. ఈ ప‌రిస్థితి మార‌కుంటే ఎమ్మెల్యే స్థాయిలో తాను ఆందోళ‌న‌కు దిగుతానని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు.

మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం అక్ర‌మంగా ఇత‌ర రాష్ట్రాల‌కు త‌రలిపోతున్న‌టువంటి ఇసుక‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు కొత్త పాల‌సీని తీసుకువ‌స్తే ప్ర‌భుత్వ విధి విధానాల‌ను ప‌క్క‌న‌పెడుతూ కొంత మంది ఇష్టారాజ్యంగా ఇసుక పాల‌సీ విధానాన్ని త‌మ సొంతానికి, వారి అవ‌స‌రాల‌కు మార్చుకుని సామాన్యుడికి ఇసుక అంద‌ని రీతిలో దోపిడీ చేస్తున్నార‌న్నారు.

ఇలా ప్ర‌తిప‌క్షాల‌కు గొంతు క‌లుపుతూ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అటు అధికార‌ప‌క్షం.. ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీలోనూ తీవ్ర‌మైన చ‌ర్చకు దారి తీశాయి. కోటంరెడ్డి వ్యాఖ్య‌లు వెనుక అర్ధ‌మేంటి..? కోటంరెడ్డి నిజంగానే అధికారుల‌ను టార్గెట్ చేశారా..? అధికారుల నెపంతో సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారా..? అన్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష టీడీపీ ఆయుధంగా మ‌లుచుకుంది. దీంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన టీడీపీ నేత‌లు జిల్లా క‌లెక్ట‌ర్ శేష‌గిరి బాబును క‌లిశారు. శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌ల్లోని నిజాలను బ‌య‌ట‌పెట్టాల‌ని వారు జిల్లా క‌లెక్టర్‌ను కోరారు.

అయితే, ఇటీవ‌ల జిల్లాలో ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లిస్తున్న ఇసుక లారీల‌ను పెద్ద మొత్తంలో పోలీసులు ప‌ట్టుకోవ‌డం, రాజ‌కీయ ఒత్తిడితో ఆ వెంట‌నే వ‌దిలేయ‌డం లాంటి ఘ‌ట‌న‌లూ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రాత్రికి రాత్రికి జ‌రిగిన సెటిల్‌మెంట్‌ల‌లో అధికార పార్టీ నేత‌ల హ‌స్తం లేకుండా ఇదంతా జ‌ర‌గ‌ద‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది. అందుకు శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్య‌లు, ఆ వెంట‌నే టీడీపీ రియాక్ష‌న్‌తో ఇప్పుడు సింహ‌పురిలో పొలిటిక‌ల్ ఇసుక తుఫాన్ లేచిందన్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle