newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

మ‌నిషిక్క‌డ‌.. మ‌న‌స‌క్క‌డ‌..రాపాక దారెటు?

20-10-201920-10-2019 08:15:48 IST
Updated On 20-10-2019 08:23:17 ISTUpdated On 20-10-20192019-10-20T02:45:48.110Z20-10-2019 2019-10-20T02:45:34.923Z - 2019-10-20T02:53:17.873Z - 20-10-2019

మ‌నిషిక్క‌డ‌.. మ‌న‌స‌క్క‌డ‌..రాపాక దారెటు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
"పాటిక్క‌డ.. ప‌లుక‌క్క‌డ‌.. మ‌నిషిక్క‌డ‌.. మ‌న‌స‌క్క‌డ‌.. ఎన్నాళ్లైనా" అనే పాట అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. మంచి మ‌న‌సులు సినిమాలోని ఆల్ టైమ్ హిట్ పాట అయిన జాబిల్లి కోసం ఆకాశ‌మ‌ల్లే పాట‌లోని లిరిక్స్ ఇవి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక నేత‌ను చూస్తుంటే అచ్చం ఇదే పాట గుర్తొస్తుంది. ఆయ‌న వ్య‌వ‌హార శైలి చూస్తుంటే మ‌నిషి ఒక ద‌గ్గ‌ర ఉన్నా.. మ‌న‌స్సు మాత్రం మ‌రో చోట ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చోట్ల ఓడినా రాజోలు నుంచి మాత్రం రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఎమ్మెల్యేగా గెలిచి స‌త్తా చాటాడు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలో ఆయ‌న జ‌య‌కేత‌నం ఎగ‌రేశారు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన టిక్కెట్‌పై ఆయ‌న గెలిచినా గెలిచిన త‌ర్వాత ఆయ‌న వైఖ‌రి మాత్రం ప‌వ‌న్ తోవ‌కు భిన్నంగా ఉంటోంది.

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్న‌ట్లుగానే ఆ పార్టీకి వ్య‌తిరేక స్టాండ్ తీసుకున్నారు. వివిధ అంశాల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు.

జ‌గ‌న్ స‌ర్కార్ చేసిన మంచి ప‌నుల‌ను ఆయ‌న ఎక్క‌డా ప్ర‌శంసించిన దాఖ‌లాలు కూడా లేవు. కానీ, ఆయ‌న ఆయ‌న పార్టీ త‌ర‌పున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం ఇందుకు భిన్నంగా అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

 

అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రాపాక వైసీపీ ఎమ్మెల్యేల‌ను మించి ప్ర‌శంస‌ల‌వ‌ర్షం కురిపించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తేశారు. ఆ స‌మ‌యంలో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైఖ‌రిపై జ‌న‌సేన శ్రేణులు నొచ్చుకున్నారు. కానీ, కేవ‌లం పాల‌నాప‌రంగా మంచిని ప్ర‌శంసించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన‌ట్లుగానే జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని అభినందించిన‌ట్లు ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. త‌ర్వాత ఎస్సైతో వివాదం, అరెస్టు వంటి వ్య‌వ‌హారాలలో ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

 

మ‌ళ్లీ ఇప్పుడు ఆయ‌న త‌న స్టాండ్ మార్చుకున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ ఇటీవ‌ల ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల కోసం వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం ద్వారా వారికి రూ.10 వేలు ఇస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్లు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి మంత్రి పినిపె విశ్వ‌రూప్‌తో పాటు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా హ‌జ‌ర‌య్యారు. స‌హ‌జంగా ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ప్ర‌కారం ఇటువంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా అంటీముట్ట‌నట్లు వ్య‌వ‌హ‌రిస్తారు.

కానీ, రాపాక మాత్రం అంతా త‌న‌దే అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించారు. మంత్రి, ఆటో డ్రైవ‌ర్ల‌తో క‌లిసి ఆయ‌న జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో మ‌రోసారి ఆయ‌న హాట్ టాపిక్‌గా మారారు.

ఇక‌, ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పోలిట్ బ్యూరో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓవైపు అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తుంటే.. మ‌రోవైపు ఎమ్మెల్యే జ‌గ‌న్‌కు పాలాభిషేకం చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే, తాను జ‌న‌సేన పార్టీలోనే ఉంటాన‌ని, వైసీపీ చేర‌తాన‌ని జ‌రుగుతున్న‌ది త‌ప్పుడు ప్ర‌చార‌మేన‌ని రాపాక వ‌ర‌ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చారు. అయితే, పార్టీలో ఉంటూనే ఇలా త‌ర‌చూ పార్టీ వైఖ‌రికి భిన్నంగా జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు గుప్పిస్తుండ‌టంతో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైఖ‌రిపై జ‌న‌సేన శ్రేణుల్లోనూ అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle